-->
Revanth: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సింగర్ రేవంత్‌.. వేడుకగా ఎంగేజ్‌మెంట్‌.. అమ్మాయి ఎవరంటే..

Revanth: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సింగర్ రేవంత్‌.. వేడుకగా ఎంగేజ్‌మెంట్‌.. అమ్మాయి ఎవరంటే..

‘బాహుబలి’ సినిమాలోని ‘మనోహరి’ పాటతో ఎంతోమంది సంగీతాభిమానుల మనసులను గెల్చుకున్నాడు ప్రముఖ ప్లేబ్యాక్‌ సింగర్‌ రేవంత్. అంతకుముందు ప్రముఖ మ్యూజిక్‌ రియాలిటీ షో ‘ఇండియన్‌ ఐడల్‌- 9’ టైటిల్ విజేతగా నిలిచి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో  వందలాది పాటలకు  గొంతు సవరించుకున్న రేవంత్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెబుతూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ క్రమంలో తాజాగా అన్విత అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమయంలో కాబోయే భార్యతో ఉంగరాలు మార్చుకున్నాడు. అనంతరం తన ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుని మురిసిపోయాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీంతో పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ కాబోయే దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

200కు పైగా పాటలు..
రేవంత్ పూర్తి పేరు.. లోల వెంకట రేవంత్ కుమార్ శర్మ. ఏపీలోని శ్రీకాకుళం అతని స్వస్థలం. విశాఖపట్నంలోని డాక్టర్. వి.ఎస్.కృష్ణా గవర్నమెంట్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. చదువుకునే సమయంలో సంగీతంపై మక్కువ పెంచుకున్నాడు. పలు మ్యూజిక్‌ కాంపీటీషన్స్‌లో పాల్గొని సత్తా చాటాడు. తెలుగు ఛానెల్స్ మ్యూజిక్‌ రియాలిటీ షోల్లోనూ పాల్గొన్నాడు. ఈక్రమంలోనే ఇండియన్‌ ఐడల్‌-9 టైటిల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగుతో పాటు కన్నడలోనూ మంచి ప్లే బ్యాక్‌ సింగర్‌గా గుర్తింపు పొందిన రేవంత్‌ ఇప్పటివరకు దాదాపు 200కు పైగా పాటలు ఆలపించాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Singer Revanth 🎤 (@singerrevanth)

Also Read:

Viral Video: మరోసారి అదరగొట్టిన నైనిక, తనయ.. ఈసారి ‘సామి సామి’ అంటూ నెటిజన్లను కట్టిపడేశారు..

Yuvraj singh: అంతరిక్షంలోకి వెళ్లిన యువరాజ్‌ సింగ్‌ బ్యాట్‌.. ఎలాగో తెలుసా..?

The Railbus: ప్రపంచపు తొలి డ్యూయల్‌ మోడ్‌ వెహికల్.. స్పెషాలిటీ తెలిస్తే కంగుతింటారు



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/342hbMh

Related Posts

0 Response to "Revanth: త్వరలో పెళ్లిపీటలెక్కనున్న సింగర్ రేవంత్‌.. వేడుకగా ఎంగేజ్‌మెంట్‌.. అమ్మాయి ఎవరంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel