-->
Dhanurmasa: నేడు తిరుప్పావై 11వ పాశురం.. కులవతి, గుణవతి అయిన గోపికను నిద్రలేపుతున్న గోదాదేవి

Dhanurmasa: నేడు తిరుప్పావై 11వ పాశురం.. కులవతి, గుణవతి అయిన గోపికను నిద్రలేపుతున్న గోదాదేవి

Tiruppavai

Dhanurmasa Special: ధనుర్మాసంలో నేడు పదకొండవ రోజు. ఈ మాసంలో అమ్మాళ్ రంగనాధుడిని తన భర్తగా పొందడానికి వ్రతమాచరిస్తూ.. పాశురాలను రచించింది. ఈ పాశురాలను తిరుప్పావై అని అంటారు. ఈ రోజు తిరుప్పావై 11వ పాశురం. ఈ పాశురాల్లో 15వ పాశురం వరకూ గోదాదేవి చెలులతో కలిసి పూలను సేకరిస్తూ, పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి.  ఒక్కొక్క రోజు ఒక్కొక్క‌ వర్ణనతో గోపికలను నిద్రలేపుతూ ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి, తన చెలులను తట్టి లేపుతూ, వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తుంది. విష్ణువు యొక్క అవతారాలను పొగుడుతుంది. నేడు పదకొండవ పాశురంలో కులవతి, గుణవతి, గుణసతి అయినటువంటి గోపికను గోదా నిద్ర లేపుతున్నారు. ఈరోజు ధనుర్మాసంలో పదకొండవ రోజు ..ఈరోజు  పాశుర‌ము, దాని అర్ధం తెలుసుకుందాం..

11వ పాశురం: 

కట్రుక్క ఱ వైక్కణంగళ్ పలక ఱన్దు
శట్రార్ తి ఱలళియచ్చెన్రు శెరుచ్చెయ్యుమ్
కుట్రమొన్రిల్లాద కోవలర్తమ్ పొర్కొడియే

పుట్రరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుట్రత్తుతోళిమా రెల్లారుమ్ వన్దునిన్
ముట్రమ్ పుహున్దు ముగిల్వణ్ణన్ పేర్పాడ
శిట్రాదే పేశాదే శెల్వప్పెణ్ణాట్టి ! నీ
ఎట్రుక్కు రంగమ్ పొరుళేలో రెమ్బావాయ్.

అర్ధం: ఈరోజు గోదా దేవి కులవతి, గుణవతి, గుణ సతి అయిన గోపికను నిద్ర లేపుతున్నారు. ఈ విడ కృష్ణుడే నన్ను పొందదానికి వ్రతం చేయాలని అని నిర్భయంగా నిద్రపోతున్న గోపిక. ఈ గోపిక వంశంలోని పెద్దలు కర్మనిష్ఠ కలిగిన వాళ్ళు. తమ ధర్మం పశుపోషణమే అని నమ్మినవారు కూడా. ఈ గోపిక తన దివ్య మంగళ విగ్రహ సౌదర్యంతో అందరిని ఆనందింప జేయగలిగిన గోపిక. లేగ దూడలు కలవి. దూడలు లాగే ఉన్నవి అయిన ఆవుల మందవి ఐన ఎన్నింటినో ఆవుల పాలు పితకగల వారు.. శత్రువులను బలంతో ఓడించదగలిగిన వారు. పుట్టలోని పాము పడగలా ఉన్నా .. అడవిలోని నెమలి వలే అందమైన జుత్తుగలదానా  లేచి బయటకు రావా.. చుట్టాలు, చెలికత్తెలు, అందరూ వచ్చేశారు.. లేచిరా.. అందరూ వచ్చి .. నీ ముంగిట్లో చేరారు.. కృష్ణుడి నామాలు కీర్తిస్తున్నారు నీకు వినిపించడంలేదా..  అయినా ఉలకకుండా పలకకుండా ఎలా ఉన్నావు.. తల్లీ ఓ సంపన్నురాలా.. నీ నిద్రకు అర్ధము ఏమిటో చెప్పవమ్మా అంటూ ఈ నిద్రకు భావాన్ని మనకు వివరించింది.

Also Read:

ఈ తేదీల్లో పుట్టినవారిపై సూర్యుడి ప్రభావం.. వీరిని పెళ్లి చేసుకుంటే జీవిత భాగస్వామి అదృష్టవంతులే..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3mz3wlZ

Related Posts

0 Response to "Dhanurmasa: నేడు తిరుప్పావై 11వ పాశురం.. కులవతి, గుణవతి అయిన గోపికను నిద్రలేపుతున్న గోదాదేవి"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel