-->
IPO: ఐపీవోగా రానున్న ట్రావెల్ బుకింగ్ వెబ్‎సైట్.. రూ.2100 కోట్ల సమీకరణే లక్ష్యం..

IPO: ఐపీవోగా రానున్న ట్రావెల్ బుకింగ్ వెబ్‎సైట్.. రూ.2100 కోట్ల సమీకరణే లక్ష్యం..

Fixed Deposits Vs Ipo Investment

ఈ ఏడాది అనేక కంపెనీలు ఐపీవోగా వచ్చే భారీగానే నిధులు సేకరించాయి. వచ్చే ఏడాది కూడా పలు కంపెనీలు ఐపీవోలు తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. TravelBooking.com(TBO) IPO కోసం సెబికి తన పత్రాలను దాఖలు చేసింది. ఐపీవో ద్వారా రూ.2000 కోట్ల వరకు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది.

రూ.2100 కోట్ల ఈ ఇష్యూలో రూ.900 కోట్లు తాజాగా ఇష్యూ కానుండగా, రూ.1200 కోట్లకు అమ్మకానికి ఆఫర్ ఉంది. ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయంలో కంపెనీ రూ.570 కోట్లను కంపెనీ వృద్ధికి, ప్లాట్‌ఫారమ్‌ను మరింత మెరుగుపరిచేందుకు ఇన్వెస్ట్ చేస్తుంది. అయితే కొత్త కొనుగోళ్లలో రూ.90 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 2006లో స్థాపించిన ఈ కంపెనీకి, యాక్సిస్ క్యాపిటల్ క్రెడిట్ సూయిస్, జెఫరీస్, JM ఫైనాన్షియల్ ఇష్యూలకు లీడ్ మేనేజర్‎గా వ్యవహరించనున్నాయి.

2022 సంవత్సరంలో LIC అతి పెద్ద IPO రాబోతుంది. దీని కారణంగా 2022లో మార్కెట్ కొత్త రికార్డును నెలకొల్పే అవకాశం ఉంది. కోటక్ మహీంద్రా క్యాపిటల్ ప్రకారం, 2022లో IPO ద్వారా సుమారు రూ. 2 లక్షల కోట్లు సమీకరించవచ్చని అంచనా. వచ్చే ఏడాది IPOల కోసం ఇప్పటికే 15 బిలియన్ డాలర్ల విలువైన ప్రతిపాదనలు SEBIకి అందాయి. మరో 11 బిలియన్ డాలర్ల ప్రతిపాదనలు త్వరలో పంపే అవకాశం ఉంది.

Read Also.. Soyameal: సోయామీల్‌ ధర తగ్గించేందుకు కేంద్రం చర్యలు.. నిల్వలపై పరిమితులు విధింపు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/32C2e2I

0 Response to "IPO: ఐపీవోగా రానున్న ట్రావెల్ బుకింగ్ వెబ్‎సైట్.. రూ.2100 కోట్ల సమీకరణే లక్ష్యం.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel