-->
Earthquake: భారీ భూకంపంతో ఉలిక్కిపడిన ఇండోనేషియా.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..

Earthquake: భారీ భూకంపంతో ఉలిక్కిపడిన ఇండోనేషియా.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..

Earthquake

Indonesia Earthquake: భారీ భూ ప్రకంపనలతో ఇండోనేషియా మళ్లీ ఉలిక్కిపడింది. ఇండోనేషియాలోని తూర్పు ప్రావిన్స్ పపువా బరాత్‌లో గురువారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు వాతావరణ సంస్థ జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది. ఇండోనేషియా కైమానా జిల్లా కేంద్రానికి 115 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని, సముద్ర గర్భం కింద 14 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని.. వాతావరణ శాస్త్ర, జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది. కాగా.. భారీ భూకంపం వల్ల ఆస్థి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు.

ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. గురువారం తెల్లవారుజామున 12.46 గంటలకు సంభవించిన భారీ భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇళ్లల్లో నిద్రపోతున్న ప్రజలంతా.. భయంతో బయటకు పరుగులు తీశారు.

Also Read:

SCCL: సింగరేణి ఘటనలో న‌లుగురి మృతదేహాలు లభ్యం.. సంతాపం తెలిపిన మంత్రులు.. కార్మికులకు అండగా ఉంటామన్న సీఎండీ

Gold Smuggling: శానిటరీ న్యాప్కిన్స్‌లో దాచి బంగారం రవాణా.. తనిఖీల్లో దొరికిపోయిన ఎయిర్‌ హోస్టెస్‌



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3ohvran

0 Response to "Earthquake: భారీ భూకంపంతో ఉలిక్కిపడిన ఇండోనేషియా.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel