-->
T20 world cup 2021: పాక్‌ను చిత్తు చేసిన కంగారూలు.. పాకిస్థాన్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా..

T20 world cup 2021: పాక్‌ను చిత్తు చేసిన కంగారూలు.. పాకిస్థాన్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా..

T20

T20 world cup 2021: టీ20 వరల్డ్‌ కప్‌లో ఇప్పటి వరకు ఓటమి అంటూ ఎరగని పాకిస్థాన్, కేవలం ఒక ఓటమిని మాత్రమే చవిచూసిన ఆస్ట్రేలియా ఫైనల్‌ పోరులో తలపడ్డాయి. దుబాయ్‌ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు పాకిస్థాన్ ఫైనల్‌లో చోటు దక్కించుకోగా, ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచకప్‌పై కన్నేసింది. హోరా హోరీగా సాగిన ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఓవైపు పాకిస్తాన్‌, మరో వైపు పూర్తిగా ఫాంలో ఉన్న ఆస్ట్రేలియా ఇలా రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో పోటీ రసవత్తరంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాక్ నిర్ణిత ఓవర్లలో 175 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్ లో రిజ్వాన్ 67, జమాన్ 55 , అజమ్ 39 పరుగులు సాధించి స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు. ఇక 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మొదటి పాక్ బౌలర్ల పై విరుచుకుపడింది.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో డేవిడ్ వార్నర్ 49 పరుగులు చేయగా.. మార్కస్ స్టోయినిస్ 40 పరుగులు, మాథ్యూ వాడే 41 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి ఓవర్ మిగిలిఉండగానే ఆస్ట్రేలియా తన లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో ఫైనల్ కు చోటు దక్కించుకుంది. వరుసగా వికెట్లు కోల్పోతున్నా ఏమాత్రం తడబడకుండా పోరాడి విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఇక ఫైనల్ లో ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ తో తలపడనుంది. చూడాలి ఈసారి కప్ ఎవరికి సొంతం అవుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి :

T20 world cup 2021: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ రిజ్వాన్.. ఒకే సంవత్సరంలో 1000 పరుగులు చేసి ఆటగాడిగా రికార్డు..

T20 World Cup 2021: కీలక మ్యాచ్‌లో రెచ్చిపోయిన పాక్‌ బ్యాట్స్‌మెన్‌.. ఆస్ట్రేలియా విజయం లక్ష్యం ఎంతంటే..

T20 World Cup 2021: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బాబర్‌ అజమ్‌.. కోహ్లీని సైతం వెనక్కి నెట్టి మరీ..

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/31SYOrX

0 Response to "T20 world cup 2021: పాక్‌ను చిత్తు చేసిన కంగారూలు.. పాకిస్థాన్ పై విజయం సాధించిన ఆస్ట్రేలియా.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel