
Dandruff Tips: విపరీతమైన చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా.? అయితే ఈ సింపుల్ టిప్‌ను ఓసారి ట్రై చేయండి.. వెంటనే ఫలితం.

Dandruff Tips: ఇటీవలి కాలంలో చాలా మంది చుండ్రుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మారుతోన్న జీవన విధానం, నీటి, వాయు కాలుష్యం పెరగడం వల్ల కూడా చుండ్రు సమస్య పెరుగుతుంది. ఇక బైక్‌లు నడిపించే వారు హెల్మెట్లు వాడడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతోంది. ఎన్ని రకాల షాంపూలు, ఆయిల్స్ వాడినా కొద్ది సమయం తగ్గినట్లే తగ్గి మళ్లీ వచ్చేస్తుంది. అయితే ఉల్లితో చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చనే విషయం మీకు తెలుసా.? ఉల్లితో తయారు చేసే మిశ్రంతో చుండ్రును పరార్ అయ్యేలా చేయొచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే..
ముందుగా కొన్ని ఉల్లిపాయలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కులగా కట్ చేయాలి. అనంతరం స్టవ్‌పై ఓ పాత్రను ఉంచి.. అందులో కొబ్బరి నూనె పోయాలి. తర్వాత ఆ నూనెలో ఉల్లిపాయ ముక్కులను వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు నలుపు రంగులోకి మారగానే స్టవ్‌ను ఆఫ్ చేయాలి. అనంతరం ఆ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసిన నూనెను కుదుళ్లకు తగిలేలా బాగా మర్దనా చేయాలి. ఇలా చేసిన గంట తర్వాత తలస్నానం చేయాలి.
ఇలా క్రమం తప్పకుండా చేస్తే వెంటనే చుండ్రు తగ్గిపోతుంది. ఒక్క చుండ్రు మాత్రమే కాకుండా.. జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా మారుతుంది. మరెందుకు ఆలస్యం ఈ సింపుల్, నేచురల్ టిప్‌ను మీరూ ఫాలో అవ్వండి మంచి ఫలితం పొందండి.
Also Read: World Richest Dog: వేల కోట్ల ఆస్తికి వారసురాలు ఈ కుక్క !! వీడియో
పులుల లెక్కింపు కోసం వెళ్లింది !! కానీ అంతలో జరగరాని ఘోరం ?? వీడియో
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3xz06Ux
0 Response to "Dandruff Tips: విపరీతమైన చుండ్రుతో ఇబ్బంది పడుతున్నారా.? అయితే ఈ సింపుల్ టిప్‌ను ఓసారి ట్రై చేయండి.. వెంటనే ఫలితం."
Post a Comment