-->
NTR: దసరాకు మహేష్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇవ్వనున్న ఎన్టీఆర్‌.. ఆ గిఫ్ట్‌ ఏంటో తెలుసా.?

NTR: దసరాకు మహేష్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇవ్వనున్న ఎన్టీఆర్‌.. ఆ గిఫ్ట్‌ ఏంటో తెలుసా.?

Ntr Mahesh Babu

NTR: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రసారమవుతోన్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్న ఎన్టీఆర్‌ తాజాగా ఈ షో ద్వారా కూడా బుల్లితెర ప్రేక్షకులను మెప్పించారు. తనదైన చలాకీ మాటలు, చలోక్తులతో ఆకట్టుకుంటూ షోకు మరింత ఆకర్షణ తీసుకొచ్చారు యంగ్‌ టైగర్‌.  ఇక ఇదిలా ఉంటే రెగ్యులర్‌ కంటెస్టెంట్‌లతో పాటు కొన్ని ఎపిసోడ్స్‌లో సెలబ్రిటీలను కూడా తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌ ఇప్పటి వరకు పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, దర్శకుడు రాజమౌళి, కొరటాల శివలతో బుల్లి తెరపై సందడి చేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈసారి ఎన్టీఆర్‌ టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దసరా రోజు ప్రసారమయ్యే ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌లో మహేష్‌ పాల్గొననున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన షూటింగ్‌ను ముందుగానే తీయనున్నట్లు సమాచారం. మరి షో నిర్వాహకులు దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు ఇస్తారో చూడాలి.

మరి ఇద్దరు బడా హీరోలు ఒకేసారి స్క్రీన్‌పై కనిపిస్తే ఫ్యాన్స్‌ సంతోషానికి అవధులు ఉంటాయా చెప్పండి. ఇదిలా ఉంటే మహేష్‌ ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తికాగానే రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు మహేష్‌.

Also Read: Bigg Boss 5 Telugu: అనుకుందే జరిగింది.. బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన ఉమాదేవి. ఎలిమినేషన్‌కు ఇవే కారణాలా.?

Megastar Chiranjeevi: సాయిపల్లవిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగాస్టార్.. అసలు కారణం ఇదే..

Keerthy Suresh: సౌందర్య చేసిన ప్రయోగం మళ్ళీ చేయడానికి రెడీ అయిన ‘మహానటి’.. అద్దెకు గర్భం.. సక్సెస్ అవుతుందా..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3tY1jmD

0 Response to "NTR: దసరాకు మహేష్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్‌ ఇవ్వనున్న ఎన్టీఆర్‌.. ఆ గిఫ్ట్‌ ఏంటో తెలుసా.?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel