
Shilpa Shetty: రాజ్ కుంద్రాకు శిల్పాశెట్టి విడాకులు ఇవ్వనుందా.? ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ఏం చెబుతోంది..

Shilpa Shetty: ప్రముఖ వ్యాపార వేత్త, బాలీవుడ్ నిర్మాత రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌లోకి వచ్చే నటీమణులను రాజ్ కుంద్రా బలవంతంగా పోర్న్ వీడియోల్లో నటింపజేశాడని, వాటిని యాప్‌ల ద్వారా ప్రసారం చేశాడనే ఆరోపణలతో ముంబయి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో లభించిన ఆధారాలు రాజ్‌కుంద్రా నేరం చేశాడన్న వాదనను బలపరుస్తున్నాయి.
ఇదిలా ఉంటే రాజ్ కుంద్రా వ్యవహారంతో నటి శిల్పా శెట్టి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ముంబయి పోలీసులు శిల్పాశెట్టిని సాక్షిగాచార్జ్‌షీట్‌లో చేర్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన భర్త ఏం చేస్తున్నాడో తనకు తెలియదని శిల్పా చార్జిషీట్‌లో పేర్కొన్నారు. ‘నేను షూటింగ్స్‌లో ఎప్పుడూ బిజీగా ఉండేదాన్ని. దీంతో రాజ్‌కుంద్రా ఏం చేస్తుండేవాడో ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యారా? అన్న ప్రశ్నలకు రోజురోజుకీ బలం చేకూరుతుంది. గతకొన్ని రోజుల క్రితమే శిల్పాశెట్టి భర్త నుంచి విడిపోవడానికి సిద్ధమయ్యారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసిన ఓ పోస్ట్ మరోసారి ఈ వార్తలకు బలం చేకూర్చాయి. స్టోరీస్‌లో ‘న్యూ ఎండింగ్స్’ అనే కొటేషన్‌ను పోస్ట్ చేసింది. ఇందులో ‘జీవితాన్ని వెనక్కి తిప్పి కొత్తగా ప్రయాణం మొదలు పెట్టే ఛాన్స్ ఉండదు, అయితే ఆ ప్రయాణాన్ని కొత్తగా ముగించవచ్చు’ అని అర్ధం వచ్చేలా సందేశం ఉంది. దీంతో శిల్పాశెట్టి తన వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టనుందా అన్న నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Megastar Chiranjeevi: సాయిపల్లవిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగాస్టార్.. అసలు కారణం ఇదే..
కాజోల్ అజయ్ దేవగన్ నాటి నుంచి నేటి వరకు మధురానుభూతులు… సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఫొటోస్
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3hPQnTf
0 Response to "Shilpa Shetty: రాజ్ కుంద్రాకు శిల్పాశెట్టి విడాకులు ఇవ్వనుందా.? ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ఏం చెబుతోంది.."
Post a Comment