
RLDA Recruitment: సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారికి సదవకాశం.. రైల్వేలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

RLDA Recruitment 2021: రైల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. భారతీయ రైల్వే ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లా భాగంగా మొత్తం 45 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఎవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా సివిల్ విభాగంగలోని అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులను భర్తీచేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. వీటితో పాటు గేట్‌లో అర్హత తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్ 23ను చివరి తేదీగా నిర్ణయిస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Crime News: కాపాలా ఉండాల్సిన వారే కామాంధులుగా మారారు.. స్పాలో పనిచేస్తున్న యువతులను లాక్కెళ్లి…!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/318zNbG
0 Response to "RLDA Recruitment: సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారికి సదవకాశం.. రైల్వేలో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే.."
Post a Comment