-->
Arjuna Phalguna Teaser: మరో విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు శ్రీవిష్ణు..

Arjuna Phalguna Teaser: మరో విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు శ్రీవిష్ణు..

Shree Vishnu

Arjuna Phalguna Teaser: కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ఈ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 09గా హీరో శ్రీ విష్ణు, జోహార్ ఫేమ్ తేజ మర్ని కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతోంది. అర్జున ఫల్గుణ అనే టైటిల్‌తో రాబోతోన్న ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. మనం జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు వెళ్లాల్సిందే. కొన్ని ఘటనలు మాత్రం మన జీవితాల్ని తలకిందులు చేస్తాయి. ఇదే విషయాన్ని టీజర్‌లో చూపించారు.

‘నాది కాని కురుక్షేత్రంలో.. నాకు తెలియని పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాను. అయినా నేను బలైపోవడానికి అభిమన్యుడిని కాదు.. అర్జునుడిని’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్‌తో సినిమా నేపథ్యం ఏంటో అర్థమవుతోంది. 65 సెకన్ల టీజర్‌లో ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లను చూపించారు. డైలాగ్స్, విజువల్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. జగదీష్ చక్రవర్తి సినిమాటోగ్రఫీ అందరినీ కట్టిపడేసేలా ఉంది. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. ఎన్ ఎమ్ పాషా సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. అర్జున ఫల్గుణ సినిమా త్వరలోనే థియేటర్‌లోకి రానుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Vijay Sethupathi: అందుకే విజయ్ సేతుపతి పై దాడి చేశా.. అసలు విషయం బయట పెట్టిన మహా గాంధీ..

Anasuya Bharadwaj: రేపు పుష్ప నుంచి మరో అప్‌డేట్‌.. అనసూయ ఫస్ట్‌లుక్ ను విడుదల చేయనున్న చిత్రబృందం

SP Balasubrahmanyam: మరణాంతరం ఎస్పీబీకి పద్మ విభూషణ్‌తో సత్కారం.. తండ్రి తరపున అవార్డు అందుకున్న తనయుడు చరణ్



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3bY1Ixk

Related Posts

0 Response to "Arjuna Phalguna Teaser: మరో విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు శ్రీవిష్ణు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel