
Rgv’s LADKI: దేశంలోనే మొదటి మార్షల్ ఆర్ట్స్ సినిమాతో రానున్న ఆర్జీవీ.. ట్రైలర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Rgv’s LADKI: రామ్ గోపాల్ వర్మ కెరీర్ లోనే అత్యంత ఖరీదైన మరియు ప్రతిష్టాత్మకమైన సినిమా “లడకి”. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను వర్మ తన సోషల్ మీడియా లో విడుదల చేశారు. ట్రైలర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. అమితాబ్ బచ్చన్ వంటి మహా నటులు ఈ చిత్రం ట్రైలర్ ని చూసి రామ్ గోపాల్ వర్మ కి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సినిమా హిందీ మరియు చైనా భాషలో విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ చిత్రాన్ని చైనా లో “డ్రాగన్ గర్ల్” టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించగా ఆర్ట్ సి మీడియా మరియు చైనా కంపెనీ బిగ్ పీపుల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మార్షల్ ఆర్ట్స్ రారాజు బ్రూస్ లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ చిత్రానికి లడకి చిత్రం నివాళి అంటున్నారు వర్మ. లడకి చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ లో నిపుణులు అయినా పూజ భలేకర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. తన ఫైటింగ్ స్కిల్స్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనున్నాయి. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ బ్రూస్ లీ కి అంకితం ఇస్తున్నారు. లడకి చిత్రం భారత దేశంలోనే మొదటి మార్షల్ ఆర్ట్స్ చిత్రం. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 10 న విడుదల చేస్తున్నారు.
లడకి చిత్రాన్ని చైనా లో జింగ్ లియు మరియు వు జింగ్ వారు బిగ్ పీపుల్ చైనీస్ కంపెనీ పతాకం పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని చైనా లోని భారీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ చైనా ఫిలిం గ్రూప్ కార్పొరేషన్ వారు డ్రాగన్ గర్ల్ పేరుతో భారీ ప్రమోషన్ తో 20 వేల థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. నవంబర్ 27న బ్రూస్ లీ 81 వ పుట్టిన రోజు సందర్భంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా లో లడకి ది డ్రాగన్ గర్ల్ మొదటి పోస్టర్ ను విడుదల చేస్తారు. అలాగే చైనా లో ని ఫోషన్ కుంగ్ ఫు ఫిలిం ఫెస్టివల్ లో బ్రూస్ లీ 81 వ పుట్టిన రోజు సందర్భంగా డ్రాగన్ గర్ల్ చిత్రాన్ని ప్రీమియర్ చేస్తారు.
Hey @PoojaBofficial ,I have a suspicion that u can actually fly after seeing u practice in this clip on Juhu beach https://t.co/tYiu1nh3NW pic.twitter.com/5DrtFllQwL
— Ram Gopal Varma (@RGVzoomin) November 8, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :
Vijay Sethupathi: అందుకే విజయ్ సేతుపతి పై దాడి చేశా.. అసలు విషయం బయట పెట్టిన మహా గాంధీ..
Anasuya Bharadwaj: రేపు పుష్ప నుంచి మరో అప్‌డేట్.. అనసూయ ఫస్ట్‌లుక్ ను విడుదల చేయనున్న చిత్రబృందం
SP Balasubrahmanyam: మరణాంతరం ఎస్పీబీకి పద్మ విభూషణ్‌తో సత్కారం.. తండ్రి తరపున అవార్డు అందుకున్న తనయుడు చరణ్
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3HiQy4T
0 Response to "Rgv’s LADKI: దేశంలోనే మొదటి మార్షల్ ఆర్ట్స్ సినిమాతో రానున్న ఆర్జీవీ.. ట్రైలర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.."
Post a Comment