
Anand Deverakonda : మా అన్నయ్య వేసిన దారిలో నేను ఈజీగా నడుచుకుంటూ వచ్చాను కానీ.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆనంద్ దేవరకొండ..

Pushpaka Vimanam : యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం “పుష్పక విమానం”. గీత్ సైని, శాన్వి మేఘన నాయికలుగా నటించారు. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ
మూవీ ని ‘కింగ్ అఫ్ ది హిల్’ ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా వ్యవహరించారు. నవంబర్ 12న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతోంది “పుష్పక విమానం”. ఇటీవలే ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమం విశాఖలో విజయ్, ఆనంద్ దేవరకొండ ఫ్యాన్స్ కేరింతల మధ్య ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా..ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ..
నేను హీరోగా ఇవాళ మీ ముందు ఉన్నానంటే కారణం అన్నయ్య, నాన్న అని అన్నారు. అన్నయ్య విజయ్ ఎంతో కష్టపడి స్టార్ హీరో అయ్యాడు. ఆయన వేసిన దారిలో నేను ఈజీగా నడుచుకుంటూ మీ ముందుకు వచ్చాను. కానీ విజయ్ ఎప్పుడూ నాకు సొంతంగా ఎదగమనే చెబుతుంటాడు అన్నారు ఆనంద్. ఆ మాట ప్రకారం ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుని నేను చేసిన చిత్రమిది. రెగ్యులర్ హీరో క్యారెక్టర్ లా ఈ చిత్రంలో నా పాత్ర ఉండదు. సహజంగా మీ చుట్టూ కనిపించే ఒక పాత్ర చిట్టిలంక సుందర్ ది. పెళ్లి చేసుకుని హాయిగా ఉందామనుకుంటే అతని భార్య లేచిపోతుంది. ఎందుకు అనేది థియేటర్ లో చూడండి. ఫన్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ అన్ని అంశాలు పుష్పక విమానం చిత్రంలో ఉంటాయి. మీరు సినిమా స్టార్టింగ్ నుంచి చివరి దాకా చూపు దృష్టి మరల్చకుండా సినిమా చూస్తారు. పుష్పక విమానం గురించి మీరు ఎదురుచూస్తున్నారని తెలుసు. నవంబర్ 12న థియేటర్లలో కలుద్దాం. అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :
RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ నుంచి అదిరిపోయే డైలాగ్ రివీల్ చేసిన రాజమౌళి.. అదుర్స్ అంతే
Eesha Rebba: వొంపు సొంపులతో ఫాన్స్ ని ఫిదా చేస్తున్న ఈషా రెబ్బ
Bigg Boss 5 Buzz: ప్రియాంక విషయంలో మానస్ అలా ఉంటాడు.. అసలు విషయం బయటపెట్టిన విశ్వ..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3H4R3z1
0 Response to "Anand Deverakonda : మా అన్నయ్య వేసిన దారిలో నేను ఈజీగా నడుచుకుంటూ వచ్చాను కానీ.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఆనంద్ దేవరకొండ.."
Post a Comment