-->
Pakka Commercial: విలనిజాన్ని చేసి చూసి వచ్చిన వాడిని.. అదరగొడుతున్న “పక్కా కమర్షియల్” టీజర్..

Pakka Commercial: విలనిజాన్ని చేసి చూసి వచ్చిన వాడిని.. అదరగొడుతున్న “పక్కా కమర్షియల్” టీజర్..

Pakka Commercial

Pakka Commercial: ప్ర‌తి రోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ వ‌రుకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.

తాజాగా పక్కా కమర్షియల్ టీజర్ విడుదలైంది. ‘ఎవరికీ చూపిస్తున్నారు సార్ మీ విలనిజం.. మీరు ఇప్పుడు చేస్తున్నారు నేను ఎప్పుడో చూసి చేసి వదిలేసాను..’ అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. టీజర్ లోని ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ – యూవీ క్రియేష‌న్స్ – బ‌న్నీవాసు – కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌ మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3BUOThL

0 Response to "Pakka Commercial: విలనిజాన్ని చేసి చూసి వచ్చిన వాడిని.. అదరగొడుతున్న “పక్కా కమర్షియల్” టీజర్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel