-->
Ravi Shastri-Virat Kohli: ముగిసిన కోహ్లీ – రవిశాస్త్రిల శకం.. వీరిద్దరు చేసిన 5 తప్పులకు టీమిండియా ఆటగాళ్లు బలి.. అవేంటంటే?

Ravi Shastri-Virat Kohli: ముగిసిన కోహ్లీ – రవిశాస్త్రిల శకం.. వీరిద్దరు చేసిన 5 తప్పులకు టీమిండియా ఆటగాళ్లు బలి.. అవేంటంటే?

Ravi Virat 2 1

Ravi Shastri-Virat Kohli: టీ20 ప్రపంచ కప్ 2021లో భారత ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాన కోచ్ రవిశాస్త్రి పదవీకాలం కూడా ముగిసింది. రవిశాస్త్రి 4 సంవత్సరాలు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. ఈ సమయంలో అతను అనేక చారిత్రక విజయాలు సాధించాడు. విరాట్, రవిశాస్త్రిల జోడీ ఆస్ట్రేలియాలో రెండుసార్లు టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. వెస్టిండీస్‌లో తొలిసారిగా టెస్టు సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఇంగ్లండ్‌లోనూ భారత్‌ 2-1తో ముందంజలో ఉంది. టీ20ల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల్లో భారత్‌ విజయం సాధించింది. నిజానికి విరాట్-శాస్త్రి జోడీ అద్భుతంగా చేసింది. అయితే వీరిద్దరూ 5 తప్పులు కూడా చేశారు. దీంతో టీమ్ ఇండియాకు సరైన ప్లేయింగ్ XI ఏర్పరచలేకపోయారు. ఆ ఐదు తప్పులేంటో చూద్దాం.

మొదటి తప్పు- విరాట్ కోహ్లి, శాస్త్రిల జోడీ టీమ్ ఇండియాకు ఫలితాలను అందించిందనడంలో సందేహం లేదు. కానీ, వీరి భాగస్వామ్యంలో టీమ్ ఇండియాకు 4వ నంబర్‌కు బ్యాట్స్‌మన్ ఫిక్స్ చేయడంలో విఫలమయ్యారు. 2019 ప్రపంచకప్‌కు ముందు, శాస్త్రి-విరాట్ జోడి అంబటి రాయుడిపై నమ్మకం పెట్టుకోకుండా తొలగించారు. రాయుడు స్థానంలో విజయ్ శంకర్ ఆడాడు. ఆ తర్వాత దినేశ్‌ కార్తీక్‌, రిషబ్‌ పంత్‌ వంటి బ్యాట్స్‌మెన్‌లు ఈ స్థానానికి పరీక్ష రాశారు. శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం లభించింది. అయితే గాయంతో ఈ ఆటగాడు తన స్థానాన్ని కోల్పోయాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ టీమ్‌ఇండియాకు ఇంకా ఆందోళన కలిగిస్తోందనడంలో సందేహం లేదు.

రెండవ తప్పు – విరాట్, శాస్త్రిల జోడి టీమ్ ఇండియాకు హార్దిక్ పాండ్యా ఎంపికను ఇవ్వలేకపోయింది. హార్దిక్ 2 సంవత్సరాల క్రితం గాయపడ్డాడు. టీమ్ ఇండియాలో ఇప్పటి వరకు మీడియం పేసర్-ఆల్ రౌండర్ ఎవరూ లేరు. శివమ్ దూబే, విజయ్ శంకర్ వచ్చి వెళ్లిపోయారు. హార్దిక్ బౌలింగ్‌కు పూర్తిగా ఫిట్‌గా లేకపోవడం, అతని ఎంపిక లేకపోవడం వల్ల టీ 20 ప్రపంచ కప్ 2021లో టీమ్ ఇండియా చాలా నష్టపోయింది.

మూడవ తప్పు- విరాట్ కోహ్లి, రవిశాస్త్రి జంట చాలా ప్రొఫెషనల్ స్టైల్‌లో పని చేయడం కనిపించింది. అయితే దీని కారణంగా టీమ్ ఇండియా చాలా మంది స్టార్‌లను కోల్పోయింది. హనుమ విహారి, మయాంక్ అగర్వాల్ లాంటి వారు సత్తా చాటారు. అయితే ఇప్పటి వరకు వీరిద్దరికీ టెస్టు జట్టులో స్థానం కన్ఫర్మ్ కాకపోవడం విశేషం. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కుల్దీప్-యుజ్వేంద్ర చాహల్ జోడీ అద్భుతంగా ఆడింది. కానీ, ప్రపంచ కప్‌ స్క్వార్డ్‌లో చోటు ఇవ్వకుండా విడగొట్టారు. దీంతో తగిన మూల్యం చెల్లించుకున్నారు.

నాల్గవ తప్పు – విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిల జోడీ సీనియర్ ఆటగాళ్లలో కూడా అభద్రతా భావాన్ని సృష్టించింది. టెస్టులో పుజారా, రహానే లాంటి ఆటగాళ్ల కెరీరీ ప్రమాదంలో కనిపిస్తుంది. ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌లో అశ్విన్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్‌ను బెంచ్‌పై కూర్చొబెట్టారు. వన్డేలు, టీ20ల్లోనూ అశ్విన్‌ను జట్టులోకి ఎంపిక చేయకుండా పక్కనపెట్టారు. నాలుగేళ్ల తర్వాత అశ్విన్ తాజాగా టీ20 జట్టులోకి వచ్చాడు.

ఐదవ తప్పు – ప్రపంచంలోని ప్రతి విజయవంతమైన జట్టులో ఒక ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ ఉంటారు. పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి జట్లను చూస్తే కచ్చితంగా ఇలాంటి వారు కనిపిస్తారు. ప్రతి జట్టు విజయంలో లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. కానీ, శాస్త్రి-కోహ్లీ జోడి టీమ్ ఇండియాను ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్‌‌ను అందించలేకపోయారు. ఖలీల్ అహ్మద్, టీ నటరాజన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఈరోజు జట్టులో లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు లేరు. ఇలాంటి అపఖ్యాతితో వీరి జోడీ నిలిచిపోయింది. ఇక భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియామకం అయిన సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ ముగిసిన రెండు రోజుల తరువాత స్వదేశంలో న్యూజిలాండ్ సిరీస్ మొదలుకానుంది. ఆ సిరస్‌తోనే ద్రవిడ్ కూడా తన వ్యూహాలకు పదును పెట్టనున్నాడు. ఇక కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరును అధికారికంగా ప్రకటించడమే మిగిలందంటూ వార్తలు వస్తున్నాయి.

Also Read: India New Captain: టీమిండియా నూతన సారథి ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానమిచ్చిన విరాట్ కోహ్లీ.. ఎవరి పేరు చెప్పాడంటే?

IND vs NMB T20 World Cup 2021: నమీబియా మీద అవలీలగా గెలిచిన టీమిండియా.. అర్ధ శతకాలతో అదరగొట్టిన రోహిత్, రాహుల్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3bT3FLl

0 Response to "Ravi Shastri-Virat Kohli: ముగిసిన కోహ్లీ – రవిశాస్త్రిల శకం.. వీరిద్దరు చేసిన 5 తప్పులకు టీమిండియా ఆటగాళ్లు బలి.. అవేంటంటే?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel