-->
Sunil : కమెడియన్ సునీల్‌‌‌కు గోల్డెన్ ఛాన్స్.. భారీ సినిమాలో కీలక పాత్ర..! ఏ మూవీలో అంటే..

Sunil : కమెడియన్ సునీల్‌‌‌కు గోల్డెన్ ఛాన్స్.. భారీ సినిమాలో కీలక పాత్ర..! ఏ మూవీలో అంటే..

Sunil

కమెడీయన్‌గా తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్. ఎన్నో సినిమాలో తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్న సునీల్.. ఆ తర్వాత హీరోగా మారాడు. అందాల రాముడు సినిమాతో సునీల్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకున్నాడు సునీల్.. ఆ తర్వాత కామెడీ పాత్రలకు గుడ్ బై చెప్పి కంప్లీట్ హీరోగా మారిపోయాడు. మర్యాద రామన్న సినిమా తర్వాత పూలరంగడు, మిస్టర్ పెళ్ళికొడుకు వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఆ సినిమాల తర్వాత సునీల్ చేసిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. దాంతో తిరిగి కమెడియన్‌గా మారాలనుకున్నాడు. అయితే మొదట్లో ఉన్నత కామెడీ టైమింగ్ ఇప్పుడు సునీల్‌లో కనిపించకపోవడంతో ఇప్పుడు విలన్‌గా మారి భయపెడుతున్నాడు. రవితేజ నటించిన డిస్కోరాజా, ఇటీవల వచ్చిన కలర్ ఫోటో సినిమాలో విలన్‌గా నటించి మెప్పించాడు సునీల్. ఇక ఇప్పుడు ఓ భారీ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడు.

రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందే పాన్ ఇండియా సినిమా షూటింగ్ ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పాత్రను దర్శకుడు శంకర్ వెరైటీగా డిజైన్ చేశాడట. ఇటీవల విడుదల చేసిన పోస్టర్లో సునీల్ కూడా కనిపించడంతో ఈ సినిమాలో సునీల్ పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాతోపాటుగా అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలోనూ సునీల్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని టాక్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Samantha Akkineni : మరో వెబ్ సిరీస్‌కు సిద్ధం అవుతున్న సమంత.. ఎవరి డైరెక్షన్‌లో అంటే..

Bigg Boss 5 Telugu: ఆమె చాలా ఓవర్ హైపర్‌గా ఉంటుంది.. అయినా నామినేట్ చేయలేక పోయా.. అసలు కారణం చెప్పిన షణ్ముఖ్..

Vidyullekha Raman: ఫిట్​నెస్​ నిపుణుడుతో పరిచయం, ప్రేమ, పెళ్లి.. లేడీ కమెడియన్ మ్యారేజ్ ఫోటోలు వైరల్



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3tuqooW

Related Posts

0 Response to "Sunil : కమెడియన్ సునీల్‌‌‌కు గోల్డెన్ ఛాన్స్.. భారీ సినిమాలో కీలక పాత్ర..! ఏ మూవీలో అంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel