-->
CM KCR: సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్‌.. సొంత జాగాలో ఇళ్లు నిర్మించుకునేవారికి నగదు పథకం..!

CM KCR: సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్‌.. సొంత జాగాలో ఇళ్లు నిర్మించుకునేవారికి నగదు పథకం..!

Cm Kcr

CM KCR: సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రభుత్వ పథకాలు, సంక్షేమంపై శాసనసభలో ప్రసంగించారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ధీటుగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, మహిళా, శిశు సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రూ.21,663 కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణ ప్రభుత్వం కేవలం ఏడేళ్లలో రూ.74,165 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడేళ్లలో రూ.42 వేల కోట్లు ఇస్తే.. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.2,74,000 కోట్లు వెళ్లాయని అన్నారు. దేశాన్ని సాకే అయిదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని గుర్తు చేశారు.

అనంతరం డబుల్ బెడ్‌ రూం స్కీం గురించి మాట్లాడుతూ.. పేద‌లు ఆత్మగౌర‌వంతో బ‌త‌కాల‌నే ఈ ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. హైద‌రాబాద్‌లో బ‌హుళ అంత‌స్తుల్లో డ‌బుల్ బెడ్రూం ఇండ్లు సిద్దమవుతున్నాయన్నారు. ఇప్పటి వరకు డబుల్‌ బెడ్ రూం ఇళ్లు ప్రభుత్వమే జాగా తీసుకొని నిర్మించేది ఇకనుంచి సొంత జాగాల్లో ఇండ్లు నిర్మించుకునేవారికి న‌గ‌దు అందిస్తామని తెలిపారు. క‌రోనా వ‌ల్ల ఆల‌స్యమైందని, వంద శాతం ఈ స్కీంను త్వర‌లోనే అమలుచేస్తామని తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గానికి వెయ్యి, ప‌దిహేను వంద‌లు ఎంత అనేది ఆలోచిస్తామ‌ని పేర్కొన్నారు.

ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్‌ కళాశాల నిర్మిస్తామన్నారు. రూ.10 వేల కోట్లతో మౌలిక వసతులను ఏర్పాటుచేస్తామన్నారు. కిడ్నీ రోగులకు కొత్తగా 38 డయాలసిస్‌ కేంద్రాలను నెలకొల్పామని, వారి రాకపోకల కోసం 10 వేల బస్‌పాసులిచ్చామని గుర్తుచేశారు. అలాగే హోంగార్డుల‌కు మంచి జీతాలు ఇస్తున్నామని, ట్రాఫిక్ పోలీసుల‌కు రిస్క్ అల‌వెన్స్ అందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఫీల్డ్‌ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకునే అంశాన్ని ప‌రిశీలిస్తామ‌న్నారు. వాస్తవం చెప్పాలంటే ఇందులో చాలా అక్రమాలు జరిగాయన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్‌ల‌ను తొల‌గించిన త‌ర్వాతే డ‌బ్బుల వినియోగం పెరిగిందని, ప‌ని దినాలు కూడా పెరిగాయని తెలిపారు.

Hyderabad Rains: హైదరాబాద్‌ అస్తవ్యస్తం.. మూడు గంటల వర్షానికి ఆగమాగం..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lpxede

Related Posts

0 Response to "CM KCR: సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్‌.. సొంత జాగాలో ఇళ్లు నిర్మించుకునేవారికి నగదు పథకం..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel