-->
Chittoor District: దొంగగా మారిన కానిస్టేబుల్.. యూనిఫామ్‌లోనే దుస్తులు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు

Chittoor District: దొంగగా మారిన కానిస్టేబుల్.. యూనిఫామ్‌లోనే దుస్తులు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు

Theft Police

అతడో పోలీస్. శాంతి భద్రతలను పరిరక్షించడం అతడి డ్యూటీ. నలుగురికి ఆదర్శంగా నిలవాలి. ఎవరైనా తప్పు చేస్తే తీసుకెళ్లి లాకప్‌లో వేయాలి. కానీ అతడే దారి తప్పాడు. ఏకంగా దొంగతనం చేస్తూ సీసీ కెమెరాకు చిక్కడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. చిత్తూరు జిల్లాలో ఈ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది.  దొంగ అవతారమెత్తిన పోలీసు 2 రోజుల క్రితం కలెక్టరేట్ రోడ్‌ లోని ఒక ఒమిని వ్యాన్ వద్ద ఉంచిన బట్టల్ని దొంగలిస్తూ నిఘా కంటికి అడ్డంగా దొరికిపోయాడు. దీన్ని గోప్యంగా ఉంచేందుకు కొందరు ప్రయత్నం చేసినా వ్యాపారి ఫిర్యాదు చేయడానికి వెనకాడకపోవడంతో ఈ దొంగ పోలీస్ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి పీవీకేఎన్ కళాశాల నుంచి కలెక్టరేట్ కు వెళ్లే మార్గంలో ఒమిని వ్యానులో దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించాడు. రోజూ పని ముగించుకున్న అనంతరం.. దుస్తలు అన్నీ మూటగట్టి.. తాడుతో కట్టి వెళ్లేవాడు. అదే విధంగా ఇటీవల రాత్రివేళ దుస్తులు మూట గట్టి వెళ్లి మరుసటిరోజు వచ్చి చూసేసరికి తక్కువగా ఉండటాన్ని గుర్తించాడు. ఆయన ముందు చూపుతో ఎవరికీ తెలియకుండా అమర్చిన సీసీ కెమెరా దొంగగా మారిన కానిస్టేబుల్‌ను పట్టించింది. సీసీ ఫుటేజీని చూడటంతో చోరీ చేసిన వ్యక్తి యూనిఫాంలో ఉన్న కానిస్టేబుల్ అని వెల్లడైంది. ఆపై ధైర్యంతో ఆ ఫుటేజీని పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేయడంతో దొంగగా మారిన పోలీసు దొరికిపోయాడు. ద్విచక్ర వాహనంలో వచ్చినవారిలో ఒకరు కానిస్టేబుల్ కాగా సాధారణ దుస్తుల్లో మరో వ్యక్తి ఏఎస్ఐగా గుర్తించినట్లు తెలుస్తోంది.

Also Read: తీవ్ర సంచలనంగా మారిన గుంటూరు జిల్లా గ్యాంగ్ రేప్ ఘటన.. మరీ ఇంత దారుణమా.. భర్తను కట్టేసి.. భార్యపై

తెలుగు రాష్ట్రాల్లో మొదలైన గణేష్‌ పండుగ సందడి.. కోవిడ్ నిబంధనలు మాత్రం మస్ట్



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3E4kiAI

Related Posts

0 Response to "Chittoor District: దొంగగా మారిన కానిస్టేబుల్.. యూనిఫామ్‌లోనే దుస్తులు దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel