-->
Hyderabad News: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు ఎస్కేప్.. తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు.. దొరికేనా..!

Hyderabad News: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు ఎస్కేప్.. తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు.. దొరికేనా..!

Sridhar Rao

Sandhya Convention MD Sridhar Rao Escape: చీటింగ్ కేసులో అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నార్సింగి, రాయదుర్గం పీఎస్‌లో ఉన్న కేసులకు సంబంధించి శ్రీధర్ రావు విచారణకు హాజరుకావడం లేదు. దీంతో శ్రీధర్ రావు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆయన జాడ తెలియకపోవడంతో ఇంటికి నోటీసులు అతికించారు. రాయదుర్గంలో కమర్షియల్ కాంప్లెక్స్‌ వ్యవహారంలో నవంబర్ 18న సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. డబుల్ రిజిస్ట్రేషన్ చేసి కోట్ల రూపాయాలు కొట్టేశాడని శ్రీధర్‌ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో బెంగళూరులో శ్రీధర్ రావును అరెస్ట్ చేసిన పోలీసులు.. హైదరాబాద్‌‌కు తీసుకువచ్చి జడ్జి ఎదుట హాజరుపరిచారు. కోర్టు శ్రీధర్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు శ్రీదర్‌రావును చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే, రిమాండ్ ముగియడంతో బెయిల్‌పై బయటకు వచ్చాడు శ్రీధర్ రావు. అలా బయటకి వచ్చిన శ్రీధర్ రావు.. పోలీసులకు కనిపించుకుండా ఎస్కేప్ అయ్యాడు.

హైదరాబాద్‌ సహా ముంబైకి చెందిన ప్రముఖ బిల్డర్స్‌ని శ్రీధర్ రావు మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో వారు డబ్బుల కోసం శ్రీధర్ రావు చుట్టూ తిరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ప్రముఖ శారీసెంటర్ యజమానురాలిని కూడా శ్రీధర్ రావు మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే శ్రీధర్‌రావు 11 కోట్ల రూపాయలు తీసుకుని ప్లాట్ అప్పగించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని శ్రీనివాస్ అనే వ్యక్తి పోలీసులు ఫిర్యాదు చేశాడు. శ్రీధర్ రావు మీద అసహజ లైంగిక దాడి కేసు కూడా నమోదయ్యింది. శ్రీధర్ రావు తనపై అత్యంత క్రూరంగా లైంగిక దాడికి పాల్పడినట్టు ఆయన జిమ్ ట్రైనర్, వ్యక్తిగత సహాయకుడు ఫిర్యాదు చేశాడు. దీనిపైనా సనత్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Read Also.. Paddy Procurement: వరి కొనుగోలుపై చేతులెత్తేసిన కేంద్రం.. యాసంగిలో వరి వేయిద్దంటూ స్పష్టీకరణ.. టీఆర్ఎస్ నేతల అసహనం..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3xwczZd

Related Posts

0 Response to "Hyderabad News: సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు ఎస్కేప్.. తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు.. దొరికేనా..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel