-->
Fiber Foods: బరువు తగ్గాలనుకుంటే ఈ 5 ఫైబర్‌ ఫుడ్స్‌ అస్సలు తినొద్దు..! ఎందుకంటే..?

Fiber Foods: బరువు తగ్గాలనుకుంటే ఈ 5 ఫైబర్‌ ఫుడ్స్‌ అస్సలు తినొద్దు..! ఎందుకంటే..?

Fiber Foods

Fiber Foods: బరువు తగ్గాలనుకునే వారు తగినంత పీచుపదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం. తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలలో ఉండే ఫైబర్ కడుపుని ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండిన భావనని కలుగజేస్తుంది. అందువల్ల మీరు ఎక్కువగా తినలేరు. అంతేకాదు కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కానీ అన్ని ఫైబర్స్ ఒకేలా ఉండవు. అధికంగా తీసుకుంటే బరువు తగ్గడానికి ఆటంకం కలిగిస్తాయి. అలాంటి 5 ఫైబర్‌ ఫుడ్స్‌ గురించి తెలుసుకుందాం.

1. వోట్స్
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఓట్ మీల్ ఆరోగ్యకరమైన అల్పాహారం. ఓట్స్‌లో ఫైబర్, ప్రొటీన్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గే ప్రక్రియకు తోడ్పడతాయి. అయితే అన్ని రకాల వోట్స్ ఒకేలా ఉండవు. ఒకే రకమైన ప్రయోజనాలను అందించవు. వోట్స్ రకరకాలుగా ప్రాసెస్ చేస్తారు. వీటిని అస్సలు తినకూడదు.
అధిక కేలరీలు, చక్కెరను కలిగి ఉంటాయి. అధిక గ్లైసెమిక్ సూచికను కూడా కలిగి ఉంటాయి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది.

2. వీట్ బ్రెడ్

బరువు తగ్గడానికి గోధుమ రొట్టెల కంటే హోల్ వీట్ బ్రెడ్ మంచిదని చెబుతారు. నిజం చెప్పాలంటే రెండింటికి పెద్ద తేడా లేదు. హోల్ వీట్ బ్రెడ్‌లో ఎక్కువ ఫైబర్ ఉండదు. పండ్లు, కూరగాయలతో పోలిస్తే అవి అనారోగ్యకరమైనవి పోషకాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే వీటిని నివారించాలి.

3. వెజిటబుల్ సూప్
బరువు తగ్గడానికి సూప్‌ల విషయానికి వస్తే క్లియర్ సూప్‌లకు వెళ్లండి. క్రీమ్ వెజిటబుల్ సూప్‌లను తాగకూడదు. ఇందులో ఫైబర్ ఉంటుంది కానీ కేలరీలు కూడా ఉంటాయి. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వీటిని తాగడం వల్ల మీకు హాని కలిగించే కేలరీల సంఖ్యను పెంచుతుంది. కాబట్టి మీరు వీటికి బదులు బోన్‌ సూప్‌ వంటివి తీసుకోవాలి.

4. తృణధాన్యాలు

తృణధాన్యాలు అల్పాహారంగా తినడానికి చాలా సులభం. కానీ అది ఆరోగ్య పరంగా మంచిది కాదు. వీటిలో ఫైబర్ అధికంగా ఉన్నా అది బరువు తగ్గడానికి అంత ప్రయోజనకరం కాదు. రుచిగల తృణధాన్యాలు అదనపు చక్కెరను కలిగి ఉంటాయి. కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉన్నప్పటికీ బరువు తగ్గడానికి సరైన ఆహార ఎంపిక కాదు.

5. ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్
పండ్లలో ఫైబర్ ఉంటుంది కానీ ప్యాక్ చేసిన పండ్ల రసాలలో ఉండదు. ఇందులో కేలరీలు, చక్కెర అధికంగా ఉంటాయి.పండ్ల రసాలకు బదులుగా తాజా పండ్లను తీసుకోండి. అవి మరింత ఆరోగ్యకరమైనవి ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడంలో సహాయపడతాయి.

Viral Photos: భూమిపై ఉన్న అందమైన భవంతి ఈ హోటల్‌.. 6000 అడుగుల ఎత్తులో నిర్మించారు..

పెద్దవారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..! అయితే కచ్చితంగా ఆ వ్యాధే..?

AP IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారంటే..?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3FkfE1e

Related Posts

0 Response to "Fiber Foods: బరువు తగ్గాలనుకుంటే ఈ 5 ఫైబర్‌ ఫుడ్స్‌ అస్సలు తినొద్దు..! ఎందుకంటే..?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel