-->
ICC Champions Trophy: ఛాంపియన్స్‌ ట్రోపీకి ఆతిథ్యమివ్వనున్న పాకిస్తాన్.. అయితే ఆడటానికి ఎవరు వెళ్తారు..?

ICC Champions Trophy: ఛాంపియన్స్‌ ట్రోపీకి ఆతిథ్యమివ్వనున్న పాకిస్తాన్.. అయితే ఆడటానికి ఎవరు వెళ్తారు..?

Ramiz

ICC Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని పాకిస్తాన్‌లో నిర్వహించడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధ్యక్షుడు రమీజ్ రాజా సంతోషంగా ఉన్నారు. ఈ టోర్నమెంట్‌ వల్ల రెండు దశాబ్దాల తర్వాత క్రికెట్‌ పోటీ దేశానికి తిరిగి రానుంది. భద్రతా కారణాల రీత్యా పాకిస్థాన్ పర్యటనను న్యూజిలాండ్, ఇంగ్లండ్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రమీజ్‌ రాజా ఐసీసీకి కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం రమీజ్ రాజా మాట్లాడుతూ.. ‘ఐసిసి తన ఎలైట్ టోర్నమెంట్లలో ఒకదానికి ఆతిథ్య దేశంగా పాకిస్తాన్‌ని ఎంచుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రధాన టోర్నమెంట్‌ని పాకిస్థాన్‌కు కేటాయించడం ద్వారా మా నిర్వహణ, కార్యాచరణ సామర్థ్యం, నైపుణ్యాలపై ICC విశ్వాసం వ్యక్తంచేసింది. 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టు బస్సుపై ఉగ్రదాడి జరిగిన తర్వాత 1996 ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంకతో కలిసి ఆతిథ్యమిచ్చిన పాకిస్థాన్ దేశంలో చాలా అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించలేకపోయింది.

పాకిస్థాన్‌కు ఎవరు వెళ్తారు?
ఛాంపియన్స్ ట్రోఫీ చివరిసారిగా 2017లో ఇంగ్లండ్‌లో జరిగింది. ఈ టోర్నీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించి పాకిస్థాన్ టైటిల్ గెలుచుకుంది. మళ్లీ ఈ టోర్నమెంట్ ఎనిమిదేళ్ల తర్వాత తిరిగి వస్తుంది. అయితే న్యూజిలాండ్, ఇంగ్లండ్ ఇటీవల పాకిస్తాన్ పర్యటన నుంచి వైదొలిగాయి. అలాంటప్పుడు ఈ టోర్నమెంట్లో పాల్గొనడానికి ఏయే దేశాలు వస్తాయో వేచి చూడాలి. మరోవైపు భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లడం చాలా కష్టంగా అనిపిస్తోంది.

ICC 2024 T20 ప్రపంచ కప్‌కు US, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఉత్తర అమెరికాలో ఇది మొదటి ప్రపంచ పోటీ. 2026 T20 ప్రపంచ కప్, 2031లో జరిగే 50 ఓవర్ల ప్రపంచ కప్‌తో సహా తదుపరి రౌండ్‌లో భారతదేశం మూడు ICC ఈవెంట్‌లకు ఆతిథ్యం ఇవ్వవలసి ఉంటుంది. 50 ఓవర్ల ప్రపంచకప్‌కు శ్రీలంక, బంగ్లాదేశ్‌తో కలిసి భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది కాకుండా 2029 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది.

పెద్దవారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..! అయితే కచ్చితంగా ఆ వ్యాధే..?

AP IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారంటే..?

Viral Photos: భూమిపై ఉన్న అందమైన భవంతి ఈ హోటల్‌.. 6000 అడుగుల ఎత్తులో నిర్మించారు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/30uTU4b

Related Posts

0 Response to "ICC Champions Trophy: ఛాంపియన్స్‌ ట్రోపీకి ఆతిథ్యమివ్వనున్న పాకిస్తాన్.. అయితే ఆడటానికి ఎవరు వెళ్తారు..?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel