
AP-TS Wether Report: రాగల 3 రోజుల్లో ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు.. అండమాన్ సముద్రంలో అల్పపీడనం..

AP – TS Wether Report: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం నుంచి రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు పేర్కొంది. ఈ నెల 10న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయువ్యదిశగా ప్రయాణించి తదుపరి 4-5 రోజుల్లో దక్షిణ ఒడిశా-ఉత్తర కోస్తా ఆంధ్రా తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.
ఈ ఉపరితల ఆవర్తం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో దాదాపు మూడు గంటలు ఏకధాటిగా కుండపోత కురిపించింది.
లింగోజిగూడలో అత్యధికంగా 10.6 సెంటీమీటర్లు, కుర్మగూడలో 10, హస్తినాపురంలో 8.8, మలక్‌పేటలో 8.7, సరూర్‌నగర్‌లో 8.6, కంచన్‌బాగ్‌లో 8.4, బహదూర్‌పురాలో 8.1, రెయిన్ బజార్‌లో 7.7, అత్తాపూర్‌లో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు రహదారులు జలయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
Hyderabad Rains: హైదరాబాద్ అస్తవ్యస్తం.. మూడు గంటల వర్షానికి ఆగమాగం..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lnzVvz
0 Response to "AP-TS Wether Report: రాగల 3 రోజుల్లో ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు.. అండమాన్ సముద్రంలో అల్పపీడనం.."
Post a Comment