-->
NHPC Recruitment 2021: నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడంటే..

NHPC Recruitment 2021: నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడంటే..

Jobs

NHPC Recruitment 2021: నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 173 ఖాళీలు ఉండగా.. సీనియర్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ రాజభాషా ఆఫీసర్, జేఈ(సివిల్, ఎలక్ట్రికల్ & మెకానికల్), సీనియర్ అకౌంటెంట్ పోస్టుల నియామకాలు చేపడుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఎన్‌హెచ్‌పీసీ అధికారిక వెబ్‌సైట్‌ nhpcindia.com లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 1, 2021 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవగా.. సెప్టెంబర్ 30, 2021 వరకు కొనసాగనుంది. కొనసాగుతుంది.

ఖాళీల వివరాలు:
సీనియర్ మెడికల్ ఆఫీసర్- 13
జూనియర్ ఇంజనీర్ (సివిల్)- 68

జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)- 34
జూనియర్ ఇంజనీర్ (మెకానికల్)- 31
అసిస్టెంట్ రాజభాషా అధికారి- 7
సీనియర్ అకౌంటెంట్- 20

ఎలా దరఖాస్తు చేయాలి..
1. అధికారిక వెబ్‌సైట్ nhpcindia.com సందర్శించండి.
2. హోమ్‌పేజీలో కనిపించే “కెరీర్స్” పై క్లిక్ చేయండి.
3. రిక్రూట్‌మెంట్ కోసం “ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి” అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
4. లాగిన్ వివరాలు, కావలసిన పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోండి.

5. అప్లికేషన్ ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.

ఎంపిక విధానం..
కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఆన్‌లైన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, గ్యాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, ఇటానగర్, జైపూర్, జమ్మూ, కొచ్చి, కోల్‌కతా, లక్నో, ముంబై, పనాజీ, రాంచీ, రాయ్‌పూర్, సిమ్లా సహా 22 నగరాల్లో ఆన్‌లైన్ పరీక్ష జరుగుతుంది.

దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ, జనరల్ ఈడబ్ల్యూసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ .250 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు రిజిస్ట్రేషన్ పీజు లేదు.

అర్హతలు..
పోస్టును బట్టి అర్హతలు ఇవ్వడం జరిగింది. పూర్తి అర్హతా వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లో గమనించవచ్చు.

కాగా, ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా లేదా విదేశాలలో ఎన్‌హెచ్‌పీసీ జాయింట్ వెంచర్స్, సబ్సిడరీ కంపెనీలతో సహా ప్రాజెక్టులు, పవర్ స్టేషన్‌లలో పని చేయాల్సి ఉంటుంది.

Also read:

Bank Robbery: చోరీ కోసం బ్యాంకులో చొరబడ్డారు.. షెట్టర్ ఓపెన్ చేసి బయటకు వచ్చిన దొంగలకు సీన్ సితారే..

Pawan Kalyan: వెల్లువెత్తిన శుభాకాంక్షలు.. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్..

Viral Video: తెగని కత్తెర.. నోటితో రిబ్బన్ కట్ చేసిన మంత్రివర్యులు.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3yHQLZw

Related Posts

0 Response to "NHPC Recruitment 2021: నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తు చివరి తేదీ ఎప్పుడంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel