
Bank Robbery: చోరీ కోసం బ్యాంకులో చొరబడ్డారు.. షెట్టర్ ఓపెన్ చేసి బయటకు వచ్చిన దొంగలకు సీన్ సితారే..

Bank Robbery: బ్యాంకులో చోరీకి విఫలయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు కొందరు దొంగలు. సినీ ఫక్కీలో ఈ దొంగలను పట్టుకున్నారు పోలీసులు. ఏమాత్రం ఏమరపాటు ప్రదర్శించినా పోలీసులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. ఇంతకీ ఏమైందంటే.. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ షెండీలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉంది. అక్కడ సెలవుదినం కావడంతో బ్యాంక్ మూసివేసి ఉంది. అయితే, బ్యాంకు లోపలి నుంచి ఏవో వింత శబ్ధాలు వస్తుండటంతో స్థానిక ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పక్కా స్కెచ్‌తో ఎంట్రీ ఇచ్చారు. షెట్టర్ లోపల దొంగలు ఉండటాన్ని గమనించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులుందరూ ఆ దుండగులను పట్టుకునేందుకు పొజీషన్ తీసుకున్నారు. చేతుల్లో తుపాకులు పట్టుకుని దుండగులు పిచ్చి పనులు చేస్తే తాట తీసేందుకు సిద్ధంగా ఉన్నారు. అలా మెల్లగా షెట్టర్ ఓపెన్ చేయడం ప్రారంభించారు. అప్పటికే అందులో చిక్కుకున్న దొంగలు.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రెడీగా ఉన్నారు. మొత్తం సినిమాను తలపించే ఈ సన్నివేశం.. స్థానికంగా పెను సంచలనంగా మారింది. మొత్తానికి సాయుధులైన ముగ్గురు దుండగులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న కత్తి, గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Video:
Also read:
Pawan Kalyan: వెల్లువెత్తిన శుభాకాంక్షలు.. అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్..
Viral Video: తెగని కత్తెర.. నోటితో రిబ్బన్ కట్ చేసిన మంత్రివర్యులు.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3BDMokk
0 Response to "Bank Robbery: చోరీ కోసం బ్యాంకులో చొరబడ్డారు.. షెట్టర్ ఓపెన్ చేసి బయటకు వచ్చిన దొంగలకు సీన్ సితారే.."
Post a Comment