-->
IND vs ENG 4th Test Day 2 Highlights: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. ముగిసిన రెండో రోజు ఆట.. దూకుడుమీదున్న రాహుల్..

IND vs ENG 4th Test Day 2 Highlights: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. ముగిసిన రెండో రోజు ఆట.. దూకుడుమీదున్న రాహుల్..

India Vs Eng

India vs England 2021: ఓవల్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 4వ టెస్ట్ మ్యాచ్‌లో రెండవ రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలన్, క్రెయిగ్ ఓవర్టన్ రెండవ రోజు ఆటను ప్రారంభించారు. తొలి రోజు 53 పరుగులు చేసిన ఇంగ్లండ్ టీమ్ 3 వికెట్లు కోల్పోయింది. ఇక రెండవ రోజు 237 పరుగులు చేశారు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ టీమ్ 290 పరుగులు చేసి.. భారత్‌పై 99 పరుగుల లీడ్‌ సాధించింది. రెండోవ రోజు మూడవ సెషన్‌ సమయానికి ఇంగ్లండ్ టీమ్ ఆలౌట్ అవగా.. మూడవ సెషన్‌లో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. ఆచితూచి ఆడుతూ జట్టు స్కోర్‌ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రెండవ రోజు ఆట పూర్తయ్యే సమయానికి టీమిండియా 34 పరుగులు చేసింది. ఇందులో 38 బంతులాడిన రోహిత్ శర్మ.. 2 ఫోర్లు బాది 18 పరుగులు చేశాడు. ఇక కేఎల్ రాహుల్ దూకుడుగా ఆడుతున్నాడు. 34 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. నాలుగు ఫోర్లు బాది 21 పరుగులు చేశాడు.

భారత్ తొలి ఇన్నింగ్స్..
నాలుగవ టెస్ట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్‌ను ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌ బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆదిలోనే తడబాటుకు గురయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి తాళలేక వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేయగా.. ఇందులో శార్థూల్ ఠాకూర్ అత్యధికంగా 57 పరుగులు చేశాడు. ఆ తరువాత కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యధికంగా 50 పరుగులు చేశాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ వరుసగా 11, 17 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్ కూడా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. మొత్తానికి తొలిరోజు మూడో సెషన్ టైమ్‌కు ఆలౌట్ అయిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఓక్స్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. రాబిన్సన్ 3 వికెట్లు తీసుకోగా.. అండర్సన్, ఓవర్టన్ చెరో వికెట్ పడగొట్టారు. ఆ తరువాత ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది.

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్..
తొలి రోజు మూడవ సెషన్ సమయానికి టీమిండియా ఆలౌట్ అవడంతో.. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే, భారత బౌలర్ల రాణించడంతో కొద్ది సేపట్లోనే 3 వికెట్లు సమర్పించుకుంది ఇంగ్లండ్ టీమ్. తొలిరోజు ఆట ముగిసే సమయానికి రోరీ బర్న్స్, జో రూట్, హసీబ్ హమీద్ వికెట్లు కోల్పోగా.. 53 పరుగులు చేశారు. రెండో రోజు డేవిడ్ మలన్, క్రెయిగ్ ఓవర్టన్ మ్యాచ్‌ను కొనసాగించగా.. మూడవ సెషన్ సమయానికి ఆలౌట్ అయ్యారు. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్‌లో 290 పరుగులు చేసి 99 పరుగుల లీడ్‌లో నిలిచింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో పోప్ అద్భుతంగా రాణించాడు. కేవలం 159 బంతుల్లోనే 81 పరుగులు చేసి టెస్ట్ మ్యాచ్‌ను కాస్తా వన్డే మ్యాచ్‌ను తలపించేలా చేశాడు. ఆ తరువాత క్రిస్ వోక్ అంతటిస్థాయిలో ఆడాడు. 50 పరగులు చేసి జట్టు స్కోర్ పెంచేందుకు కృషి చేశాడు. కెప్టెన్ జో రూట్ 21 పరుగులు చేయగా.. మలన్ 31, బెయిర్‌స్టో 37, మోయిన్ 35, పరుగులు చేశారు. ఇక భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. బూమ్రా, జడేజా చెరి 2 వికెట్లు తీసుకోగా.. ఠాకూర్, శిరాజ్ చెరో వికెట్ తీశారు.

భారత్ సెకండ్ ఇన్నింగ్స్..

రెండో రోజు ఆట ప్రారంభమైన తరువాత మూడవ సెషన్ సమయానికి ఇంగ్లండ్ టీమ్ ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 290 పరుగులు చేసి భారత్‌పై 99 పరుగుల ఆధిక్యతను సాధించింది. అయితే, సెకండ్ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత బ్యాట్స్‌మెన్స్.. తొలిఇన్నింగ్స్ పాఠాలను మదిలో పెట్టుకున్నట్లున్నారు. ఆ కారణంగా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతూనే జట్టు స్కోర్‌ను పెంచారు. 12 ఓవర్లలో 34 పరుగులు చేశారు. అయితే, రోహిత్, రాహుల్ ఇద్దరు కూడా వరుస ఫోర్లు బాదేశారు. రోహిత్ శర్మ 2 ఫోర్లు కొట్టగా, రాహుల్ ఏకంగా 4 ఫోర్లు కొట్టేశాడు. మొత్తానికి సెకండ్ డే లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 12 ఓవర్లలో 34 పరుగులు చేసింది. మూడో రోజులు టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కలిసి సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగించనున్నారు.

Also read:

Villagers Protest: ఏపీ రాజధాని పంచాయతీ పెద్దలపై గ్రామస్థుల వినూత్న నిరసన.. ఆఫీసులో గాడిదను కట్టేసి ఆందోళన.. ఎందుకో తెలుసా..

Coconut Oil Health Benefits: కొబ్బరి నూనె 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి..!

Cholesterol Drug: చెడు కొలెస్ట్రాల్‌‌‌కు చెక్.. ఇంజెక్షన్ రూపంలో సరికొత్త ఔషధం.. ఖరీదు తెలిస్తే షాకవ్వాల్సిందే?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3n1YTlM

Related Posts

0 Response to "IND vs ENG 4th Test Day 2 Highlights: భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్.. ముగిసిన రెండో రోజు ఆట.. దూకుడుమీదున్న రాహుల్.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel