
Tesla: చైనాలో తయారైన కార్లు భారత్‌లో అమ్మవద్దు.. ఇక్కడే ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ ఏర్పాటు చేయండి.. టెస్లాకు గడ్కారీ సూచన!

Tesla: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలని ప్రభుత్వం అనేకసార్లు టెస్లాను కోరింది. దీని కోసం, కంపెనీకి అన్ని ప్రభుత్వ సహాయాలను అందిస్తామని కూడా హామీ ఇచ్చింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం జరిగిన ‘ఇండియా టుడే కాంక్లేవ్ 2021’ లో ఈ విషయం చెప్పారు. ఈ సందర్భంగా, గడ్కరీ టాటా ఎలక్ట్రిక్ వాహనాలు టెస్లా వాహనాల కంటే తక్కువ కాదని అన్నారు.
చైనాలో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను భారతదేశంలో విక్రయించవద్దు
చైనాలో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను భారతదేశంలో విక్రయించవద్దని నేను టెస్లాను అడిగాను. ”టెస్లా భారతదేశంలో తన వాహనాలను తయారు చేసి ఇక్కడ నుండి ఎగుమతి చేయాలి. మీకు (టెస్లా) ఏ సహాయం కావాలన్నా, మా ప్రభుత్వం అందిస్తుంది.” అని టెస్లాకు చెప్పడం జరిగిందని గడ్కరీ తెలిపారు. అయితే, టెస్లా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి పన్ను రేటును తగ్గించాలని డిమాండ్ చేస్తోంది.
దిగుమతి చేసుకున్న వాహనాలపై 60 నుండి 100% పన్ను
పన్ను మినహాయింపు డిమాండ్ గురించి టెస్లా అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి తెలిపారు. గత నెలలో, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ టెస్లాను భారతదేశంలో ముందుగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రారంభించాలని కోరింది. ఆ తర్వాత మాత్రమే దానికి పన్ను మినహాయింపు కోసం పరిగణనలోకి వస్తుంది. ప్రస్తుతం, దిగుమతి చేసుకున్న వాహనాలపై పన్ను 60 నుండి 100%వరకు ఉంటుంది.
ఎలక్ట్రిక్ వాహనాలకు 110% పన్ను హానికరం
రోడ్డు మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో, టెస్లా $ 40,000 కంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలపై 110% (100% దిగుమతి సుంకం మరియు 10% సాంఘిక సంక్షేమ సర్‌ఛార్జ్) పన్ను ‘జీరో ఎమిషన్’ వాహనాలకు హానికరం అని చెప్పింది. 10% సాంఘిక సంక్షేమ సర్‌చార్జ్ లేకుండా ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపై (దిగుమతి ధర ఎంతైనా) గరిష్టంగా 40% పన్ను విధించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.
మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు..
టాక్స్ ల విషయంలో మార్పులు చేయడం వల్ల దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పర్యావరణ వ్యవస్థ అభివృద్ధిని పెంచుతుందని టెస్లా చెబుతోంది. భారతదేశంలో సేల్స్, సర్వీస్, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెద్ద పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. టెస్లా తన గ్లోబల్ బిజినెస్ కోసం భారతదేశం నుండి వస్తువుల కొనుగోలును భారీగా పెంచుతుందని కూడా వెల్లడించింది.
ఇవి కూడా చదవండి: CM Dance: స్టెప్పులేసిన ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్.. వీడియో వైరల్
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lqoweF
0 Response to "Tesla: చైనాలో తయారైన కార్లు భారత్‌లో అమ్మవద్దు.. ఇక్కడే ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ ఏర్పాటు చేయండి.. టెస్లాకు గడ్కారీ సూచన!"
Post a Comment