-->
RRR Movie: నాటు నాటు పాట మీద రచ్చ రచ్చ.. జక్కన్నా వినిపిస్తోందా?

RRR Movie: నాటు నాటు పాట మీద రచ్చ రచ్చ.. జక్కన్నా వినిపిస్తోందా?

Rrr

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ ( రణం రౌద్రం రుధిరం ).. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నమే ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. అలాగే వీరిద్దరికి జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హలీవుడ్ భామా.. ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టీర్ అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈీ సినిమా కోసం యావత్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా విడుదలైన నాటు నాటు వీర నాటు సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తోంది.

తారక్- చెర్రీ మెరుపు లాంటి డ్యాన్స్ మూమెంట్స్, అదరగొట్టే కీరవాణి ట్యూన్లు… జక్కన్న మేకింగ్ వ్యాల్యూస్… అన్నీ కలిపి నాటునాటు పాటను ఆన్‌లైన్‌లో ఆల్‌రౌండర్ పాటగా మార్చేశాయి. నేషనల్‌ లెవల్లో ట్రెండ్ అవుతోందీ పాట. కాకపోతే… చంద్రబోస్ రాసిన తెలుగు వెర్షన్‌లో ఆ లిరిక్స్ మీద కొన్ని సణుగుళ్లయితే తప్పడం లేదు.

పశువుల దాణాక్కూడా పనికిరాని ఎర్రజొన్నలతో రొట్టెలా… పైగా అందులో మిరపతొక్కా… ఏంటి చంద్రబోసూ రాసే ముందు చూసుకోవద్దూ.. అని చురకలంటిస్తున్నారు. కీసుపిట్ట కూసినట్టు అంటున్నావ్… కీసుపిట్ట అంటే విజిల్ అని తెలుసుగా మీకు… దానికై అదే ఎలా కూస్తుంది చెప్పండి… అని ప్రశ్నిస్తున్నారు కూడా.

వీరంగం వేస్తారు గాని సేయరు కదా.. పదాల్ని అన్వయించేముందే వాటి పరమార్థాలు తెలుసుకుని ముందుకెళితే బాగుండేది అనేది నెటిజన్లిస్తున్న సూచన. సీనియర్ మోస్ట్ రైటర్‌గా పేరున్న చంద్రబోస్‌ ఈమాత్రం జాగ్రత్తలు తీసుకుని వుంటే ఇలాంటి విమర్శలకు చోటుండేది కాదేమో.

Byline: Srihari Raja, ET

Also Read: Kurup : వివాదంలో చిక్కుకున్న దుల్కర్‌ సల్మాన్ సినిమా.. “కురుప్” పై కోర్టుకెక్కిన వ్యక్తి..

Sarkaru Vaari Paata: భారీ ధరకు మహేష్ సర్కారు వారి పాట ఓవర్సీస్ రైట్స్.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

18 Pages : ఈ కుర్రహీరో “18 పేజెస్” లో ఏం రాసుకొని రాబోతున్నాడో తెలిసేది అప్పుడే.. నిఖిల్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3kAtRiy

0 Response to "RRR Movie: నాటు నాటు పాట మీద రచ్చ రచ్చ.. జక్కన్నా వినిపిస్తోందా?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel