-->
Corona Virus: ఈ రెండేళ్లలో కరోనా రక్కసికి చిక్కిన భారత సైన్యం ఎంతమందో తెలుసా.. లెక్కలు చెప్పిన రక్షణ మంత్రి..

Corona Virus: ఈ రెండేళ్లలో కరోనా రక్కసికి చిక్కిన భారత సైన్యం ఎంతమందో తెలుసా.. లెక్కలు చెప్పిన రక్షణ మంత్రి..

Army Corona

Corona Virus: రెండేళ్ల నుంచి దాదాపు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అన్ని విధాలుగా వణికిస్తూనే ఉంది.  ఎవరికీ ఎవరిని కాకుండా చేస్తూనే ఉంది. అయితే కరోనా కేసుల విషయంఫై రాజ్య సభలో అజయ్ భట్ ప్రకటిస్తూ.. ఇప్పటి వరకూ మన సైన్యంలో న దాదాపు 70,000 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు చెప్పారు. అంతేకాదు ఈ వైరస్ బారిన పడి దాదాపు  200 మంది మరణించారని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ సోమవారం రాజ్యసభకు తెలిపారు.

2019 చివర్లో చైనాలో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి కారణంగా దేశ‌వ్యాప్తంగా మొత్తం 3.40 ల‌క్షల మంది క‌రోనా బారిన‌ప‌డి కోలుకున్నార‌ని చెప్పారు. భారత సైన్యంలోని 45,576 మంది సిబ్బంది కరోనా బారిన పడగా ప‌డ‌గా 137 మంది మృతి చెందారు. భారత వైమానిక దళానికి చెందిన 14,022 మంది సిబ్బంది క‌రోనా బారిన ప‌డ‌గా 49 మంది మృతి చెందారు. భారత నావికాదళానికి చెందిన 7,747 మంది సిబ్బంది కొవిడ్ బారిన ప‌డ‌గా న‌లుగురు మృతి చెందారు అని భట్  వివరించారు.

చైనాలో మొదటిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ కరోనా మహమ్మారి.. గత రెండేళ్లనుంచి రకరకాల రూపాలను సంతరించుకుంటూ.. కొత్త వేరియెంట్స్  ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురు చేస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఒమిక్రాన్‌ అనే మరో కొత్త వేరియంట్‌ సౌతాఫ్రికాలో వెలుగు చూసి.. అనేక దేశాల్లో వ్యాపించిన సంగతి తెలిసిందే.

Also Read: తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద మరో అద్భుత నిర్మాణం.. వైరల్ అవుతున్న ఫోటోలు..

ఇన్నాళ్లు ఓ ఆఫీసర్‌ను టార్గెట్‌ చేసిన మంత్రివర్యులు.. ఇప్పుడు ఆయనే టార్గెట్‌గా మారారు.

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3cYicGi

0 Response to "Corona Virus: ఈ రెండేళ్లలో కరోనా రక్కసికి చిక్కిన భారత సైన్యం ఎంతమందో తెలుసా.. లెక్కలు చెప్పిన రక్షణ మంత్రి.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel