
Tirumala – Dollar Seshadri: తిరుపతికి డాలర్ శేషాద్రి పార్థీవ దేహం.. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు..

Tirumala – Dollar Seshadri: డాలర్ శేషాద్రి పార్ధీవ దేహం తిరుపతికి చేరుకుంది. ఓల్డ్ మెటర్నటీ ఆసుపత్రి రోడ్డులోని సిరిగిరి అపార్ట్ మెంట్ వద్ద డాలర్ శేషాద్రి పార్ధీవ దేహాన్ని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, డిప్యూటీ ఈఓ హరీంధ్రనాధ్, టీటీడీ హెచ్ డీపీపీ మెంబర్ వెంకటేశ్ శర్మ రిసీవ్ చేసుకున్నారు. అనంతరం డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలకు సంబంధించి ఏర్పాట్లపై శేషాద్రి కుటుంబ సభ్యులతో పలు సూచనలు చేశారు ధర్మారెడ్డి. సిరిగిరి అపార్ట్మెంట్ లో ప్రజలు డాలర్ శేషాద్రి భౌతికకాయాన్ని దర్శించుకునేలా బ్యారీకేడ్లతో ఏర్పాట్లు చేయించారు. అనంతరం శేషాద్రి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ధర్మారెడ్డి. డాలర్ శేషాద్రి సోదరులు మాట్లాడుతూ ఆయన మృతి తీరలేనిదని చెప్పారు. ఆయనకు చిన్నప్పటి నుండి తిరుపతిలోని గోవిందరాజస్వామి అంటే అపారమైన భక్తి అని, ఆయన ఎప్పుడూ స్వామివారి సేవలోనే గడపాలని చిన్నప్పటి నుండి కోరుకునేవారని తెలిపారు. ఆయనకు విద్య పూర్తి చేసుకున్న అనంతరం ఎల్ఐసీలో ఉద్యోగం వచ్చినప్పటికీ శ్రీవారిపై భక్తితో ఎల్ఐసీలో ఉద్యోగం వదులుకుని టీటీడీలో చేరారని చెప్పారు. ఆయన లాంటి క్రమశిక్షణ ఉన్న వ్యక్తులను చూడలేమని అన్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిలోని హరిశ్చంద్ర శ్మశాన వాటికలో శేషాద్రికి అంత్యక్రియలు జరుగుతాయని తెలియజేశారు శేషాద్రి కుటుంబ సభ్యులు.
Also read:
Health Tips: రోజూ ఇలా బ్రెష్ చేయకుంటే గుండె జబ్బులు తప్పవు.. తాజా పరిశోధనల్లో సంచలనాలు..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/316x5UL
0 Response to "Tirumala – Dollar Seshadri: తిరుపతికి డాలర్ శేషాద్రి పార్థీవ దేహం.. ఇవాళ మధ్యాహ్నం అంత్యక్రియలు.."
Post a Comment