-->
Indian Railway: రైళ్లు నిత్యం తిరిగే దూరం ఎంత..? దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు.. ఎన్నో ఆసక్తికర విషయాలు..!

Indian Railway: రైళ్లు నిత్యం తిరిగే దూరం ఎంత..? దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు.. ఎన్నో ఆసక్తికర విషయాలు..!

Trains

Indian Railway: దేశంలో అతిపెద్ద వ్యవస్థ అంటే రైల్వే అనే చెప్పాలి. రోజుకు వేల సంఖ్యలో రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. రైళ్ల రాకపోకల వల్ల కోట్లాది మంది ప్రయాణాలు సాగిస్తుంటారు. మనం ప్రయాణించే రైళ్లలో ఎన్నో రకాలుగా ఉంటాయి. సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌, ఎక్స్‌ ప్రెస్‌, ప్యాసింజర్‌ రైళ్లు ఉంటాయి. అంతేకాదు బస్సు చార్జీలకన్నా రైలు చార్జీలు చాలా తక్కువ. అయితే రైల్వే వ్యవస్థలో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి.

మన దేశంలో రైళ్లు వివిధ రాష్ట్రాల నుంచి రాజధానుల వరకు తిరుగుతుంటాయి. రైళ్లను నడిపే లోకో పైలట్‌ నెలకు లక్ష రూపాయల వరకు వేతనం అందుకుంటారు. అలాగే రైళ్లకు ఉండే సస్పెషన్‌ కారణంగా వచ్చే ధ్వని ఫ్రీక్వెన్సీ 1.2 గిగాహెడ్జ్‌ వరకు ఉంటుంది. ఇదే ఫ్రీక్వెన్సీని చాలా మంది సౌకర్యంగా ఫీలవుతుంటారు. ఇక రైళ్లలో ప్రయాణించే వారికి బాగా నిద్ర కూడా వస్తుంది. రైళ్లలో ప్రయాణిస్తే అలసట రాకుండా ఉంటుంది. అందుకే రైళ్లలో ఎక్కువ మంది ప్రయాణించేందుకు ఇష్టపడతారు.

రైళ్లు నిత్యం తిరిగే దూరం..

ఇక మన దేశంలో ఉన్న14వేల 300పైగా రైళ్లు నిత్యం చాలా దూరం వరకు ప్రయాణిస్తాయి. ఆ దూరం రోజూ చంద్రున్ని మూడుసార్లు చుట్టి వచ్చినంత దూరానికి సమానమట. అలాగే మనం ఎక్కువగా రైలు టికెట్లు బుకింగ్‌ చేసుకోవాలంటే ఐఆర్‌సీటీసీ ద్వారానే. ఈ వెబ్‌సైట్లో నిమిషానికి అక్షరాల 12 లక్షల మంది టికెట్లను బుక్‌ చేసుకుంటున్నారని రైల్వే అధికారులు చెబుతున్నమాట. ఇవి గతంలోనివి.. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను మరింతగా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం రోజు వారి టికెట్లు బుక్‌ చేసుకునే వారి సంఖ్య పెరిగింది. ఈ కారణంగానే ఐఆర్‌సీటీసీలో సమస్యలు తలెత్తకుండా సర్వర్లను ఎప్పటికప్పుడు పెంచుతున్నారు.  అయినప్పటికీ కొన్ని సమయాల్లో ఐఆర్‌సీటీసీలో సాంకేతికంగా సమస్యలు తలెత్తుతుంటాయి. కొన్ని సమయాల్లో రైలు టికెట్లు బుక్ చేసే క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తుతుంటుంది.

రైల్వే కోచ్‌లను పట్టాలపై పెట్టేందుకు..

ఒకప్పుడు రైల్వే కోచ్‌లను పట్టాలపై పెట్టేందుకు ఏనుగులను వాడేవారట. సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇప్పుడు భారీ క్రేన్లు, పెద్ద మిషన్లతో కోచ్‌లను పట్టాలపై పెడుతున్నారు. ఇక మన దేశంలో పొడవైన పేరున్న రైల్వేస్టేషన్‌ ఏదంటే ‘వెంకటనరసింహరాజువారిపేట’. ఈ స్టేషన్‌ తమిళనాడు సరిహద్దులో ఏపీ రాష్ట్రంలో ఉంది. ఈ స్టేషన్‌ భారతీయ రైల్వేలోని అన్ని స్టేషన్‌ల పేర్లలో అతి పొడవైనదిగా ప్రత్యేకతను కలిగి ఉంది. ఇకపోతే మన దేశంలో రైళ్లు సమయానికి రావనే పేరుంది. చాలా వరకు రైళ్లు ఎప్పుడూ సమయానికి రావు. ఒక వేళ వచ్చినా సమయం ప్రకారం గమ్యానికి చేరుకోవు. అనుకున్న సమయం కాకుండా కాస్త ఆలస్యంగా చేరుకుంటాయి. అయితే అత్యంత ఆలస్యంగా నడిచే రైలు మాత్రం ఒకటుంది. అదే గౌహతి త్రివేండ్రం ఎక్స్‌ ప్రెస్‌. ఈ రైలు ఎప్పుడూ ఆలస్యంగానే స్టేషన్‌కు వస్తుంది. ఎంతంటే సుమారుగా 10 నుంచి 12 గంటల వరకు ఆలస్యంగా నడుస్తుందట. అందుకే ఆలస్యంగా వచ్చే రైలుగా పేరుగాంచింది.

దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు:

ఇక మన దేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైలు కూడా ఉంది. అదే ‘వివేక్‌ ఎక్స్‌ ప్రెస్‌’. ఈ రైలు దిబ్రునగర్‌ నుంచి కన్యాకుమారికి వెళ్తుంది. ఈ రైలు ప్రయాణించే దూరం 4, 273 కిలోమీటర్లు. అలాగే అత్యంత తక్కువ దూరంలో ఉన్న రెండు ప్రధానమైన, మేజర్‌ రైల్వేస్టేషన్లున్నాయి. అవి నాగ్‌పూర్‌, అజ్ని. వీటి మధ్య దూరం ఎంతంటే కేవలం మూడు కిలోమీటర్లు మాత్రమే.

ఆశ్చర్యం కలిగించే ఈ రెండు స్టేషన్లు:

ఇక రైల్వే వ్యవస్థలో ఈ రెండు స్టేషన్లను చూస్తే ఆశ్చర్యం కలిగిస్తాయి. నవాపూర్‌ అనే రైల్వేస్టేషన్‌ను సరిగ్గా రెండు రాష్ట్రాల మధ్య నిర్మించారు. ఎంతంటే ఒక అడుగు అవతలికి వేస్తే వేరే రాష్ట్రం అవుతుంది. ఈ స్టేషన్‌ మహారాష్ట్ర-గుజరాత్‌ రాష్ట్రాల మధ్య ఉంది.

కాగా, రైల్వే వ్యవస్థలో గతంలో కంటే ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చాయి. రైల్వే టికెట్ల విషయంలో, రైలు ప్రయాణంలో, ఇతర సేవలను మరింతగా విస్తరిస్తూ వన్నాయి. ప్రయాణికుల కోసం అదనపు రైళ్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది రైల్వే శాఖ. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా మరిన్ని సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. గతంలోకంటే ఇప్పుడు రైల్వే శాఖలో ఎన్నో మార్పులు వచ్చాయి. రైల్వే కోచ్‌లను పెంచడం, అత్యాధునిక కోచ్‌లను అందుబాటులోకి తీసుకువడం, రైల్వే స్టేషన్‌లలో అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రైల్వే శాఖ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉంది.

ఇవి కూడా చదవండి:

Onion Price: కేంద్రం గుడ్‌న్యూస్‌.. మార్కెట్లోకి బఫర్‌ స్టాక్‌.. భారీగా తగ్గిన ఉల్లి ధర..!

GST: భారతదేశంలో జీఎస్టీలో మూడు రకాలు.. సీజీఎస్టీ, స్టేట్‌జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ.. వీటి అర్థాలు ఏంటంటే..!

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3GM0cg1

Related Posts

0 Response to "Indian Railway: రైళ్లు నిత్యం తిరిగే దూరం ఎంత..? దేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు.. ఎన్నో ఆసక్తికర విషయాలు..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel