-->
Shriya: ముంబయికి షిఫ్ట్‌ అయిన శ్రియ.. సడెన్‌గా స్పెయిన్‌ నుంచి మకాం ఎందుకు మార్చిందో తెలుసా.?

Shriya: ముంబయికి షిఫ్ట్‌ అయిన శ్రియ.. సడెన్‌గా స్పెయిన్‌ నుంచి మకాం ఎందుకు మార్చిందో తెలుసా.?

Shriya

Shriya Saran: 2001లో వచ్చిన ‘ఇష్టం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల తార శ్రియ. తొలి చిత్రంలోనే తనదైన అందం, నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది తక్కువ సమయాలోనే టాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు సంపాదించుకుంది. వరుస సినిమాలతో, బడా అగ్ర కథనాయకుల సరసన ఆడిపాడిన ఈ చిన్నది బిజీ హీరోయిన్‌గా మారింది. తెలుగుతో పాటు తమిళం, అప్పుడప్పుడు హిందీ చిత్రాల్లోనూ నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ చిన్నది. ఇక ఈ అమ్మడు 2018లో రష్యాకు చెందని ఆండ్రూవ్‌ కోర్సెవ్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చిందీ చిన్నది.

సినిమాలో ఎంపికలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. వివాహం తర్వాత భర్తతో కలిసి స్పెయిన్‌లోనే సెటిల్‌ అయ్యింది శ్రియ. సినిమాలకు సంబంధించి పని ఉన్నప్పుడు మాత్రమే ఇండియా వస్తూ షూటింగ్‌లో పాల్గొంటూ ఉండేది. అయితే తాజాగా శ్రియ స్పెయిన్‌ నుంచి తన మకాన్ని ముంబయికి మార్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముంబయిలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకుందని తెలుస్తోంది. అయితే ఉన్న ఫలంగా శ్రియ ఇండియాకు రావడానికి ఓ బలమైన కారణముందని తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

శ్రియ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత శ్రియ.. పలు వెబ్‌ సిరీస్‌లలో నటించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆర్‌.ఆర్‌.ఆర్‌ విజయవంతమైతే మళ్లీ శ్రియాకు ఆఫర్లు క్యూ కట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కారణంగానే మళ్లీ సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టే.. ఈ అందాల తార ముంబయికి షిప్ట్‌ అయినట్లు తెలుస్తోంది. ఇక శ్రియ.. తెలుగులో ‘గమనం’తో పాటు హిందీ, తమిళంలో ఒకకో సినిమాలో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

Also Read: Health Tips: రోజూ 5 రకాల పండ్లు.. కూరగాయలు తింటే ఎక్కువ రోజులు బతుకుతారట… నిపుణులు ఏం అంటున్నారంటే..

Bank News: రూ.170 కోట్లు.. కస్టమర్ల నుంచి ముక్కు పిండి ఆ ఛార్జీలు వసూలు చేసిన పీఎన్‌బీ

Pitru Paksha 2021: మహాలయ పక్షాలు ప్రారంభం.. పితృ దేవతలకు పూజలు… పండితులకు దానాలు ఎప్పటివరకు ఇవ్వొచ్చంటే..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EDVos3

Related Posts

0 Response to "Shriya: ముంబయికి షిఫ్ట్‌ అయిన శ్రియ.. సడెన్‌గా స్పెయిన్‌ నుంచి మకాం ఎందుకు మార్చిందో తెలుసా.?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel