
Aakashavani: ఆ గూడెం వాసుల జీవితాలను రేడియో ఎలా మార్చేసింది.. ఆసక్తికరంగా ఆకాశవాణి ట్రైలర్.

Aakashavani Trailer: సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ఆకాశవాణి. ఈ సినిమాకు రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాను ‘సోనీ లైవ్’ ఓటీటీ వేదికగా ఈ నెల 24న విడుదల చేయనున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడడంతో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మూవీ యూనిట్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.
1:46 నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ ఆద్యతంతం ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్‌ను గమనిస్తే దర్శకుడు ఇంతవరకు తెలుగులో రాని ఓ విభిన్న కథాంశంతో సినిమాను తెరకెక్కించనట్లు తెలుస్తోంది. ప్రపంచానికి దూరంగా, బయట ఇంకో ప్రపంచం కూడా ఉందని తెలియకుండా కొందరు గూడెం వాసులు నివసిస్తుంటారు. వీరందరినీ ఓ దొర భయపెట్టిస్తుంటాడు. గూడెంలో ఉన్న ప్రజలను అడవి దాటకుండా చూస్తుంటాడు. అయితే ఇదే సమయంలో గూడెంలోని ఓ కుర్రాడికి అనుకోకుండా ఓ రేడియో దొరుకుతుంది.
ఇంతకీ ఆ రేడియో ఎక్కడి నుంచి వచ్చింది.? దాని వల్ల ఆ గూడెం వాసుల జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయన్నదే సినిమా ఇతివృత్తం. ట్రైలర్‌ను గమనిస్తే సినిమాను అత్యంత సహజమైన లొకేషన్‌లో తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. విభిన్న కథాంశంతో వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఈ ట్రైలర్‌పై మీరూ చూసేయండి మరి..
ప్రభాస్ చేతుల మీదుగా..
ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్‌ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయడం మరో విశేషం. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన అనంతరం ప్రభాస్ సినిమా ట్రైలర్ చాలా బావుందని, సినిమా ఇన్నోవేటివ్‌గా అనిపిస్తుందని, సినిమా పెద్ద హిట్ కావాలంటూ ప్రభాస్ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EBGN0g
0 Response to "Aakashavani: ఆ గూడెం వాసుల జీవితాలను రేడియో ఎలా మార్చేసింది.. ఆసక్తికరంగా ఆకాశవాణి ట్రైలర్."
Post a Comment