Ginger Tea: ప్రతి రోజు ఉదయాన్నే అల్లం టీ తాగితే ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే తాగకుండా ఉండలేరు..!

Ginger Tea: సాధారణంగా చాలా మందికి నిద్ర లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. అది కొందరికి ఎంతా అంటే.. టీ కడుపులో పడందే రోజు గడవనంత అని చెప్పాలి. అయితే నార్మల్ టీ కాకుండా ఉదయాన్నే అల్లం టీ తాగితే ఏం అవుతుందో తెలుసుకుందాం. అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలిసిందే. వైద్యులు, ఆయుర్వేద నిపుణులు కూడా ఎప్పటి నుంచో చెబుతున్న మాట. విటమిన్ సి, మెగ్నిషియం, ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం శరీరానికి మేలు చేస్తుంది. అయితే అల్లం టీ కూడా ఆరోగ్యానికి మంచిదే. అల్లంతో ఎన్నో ఉపయోగాలున్నాయి.
గుండె వ్యాధుల నుంచి ..
కాగా, అల్లం గుండెకు ఎంతగానో ఉపయోగపడతుంది. అల్లంలోని జింజరాల్స్, జింజెరాన్‌లు రక్తప్రసరణకు తోడ్పడుతాయి. రక్తనాళాల్లో పేరుకున్న అడ్డంకులను సైతం తొలగించేలా చేస్తుంది. అంతేకాదు.. అల్లం టీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. ప్రతి రోజు ఉదయాన్నే అల్లం టీ తాగడం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది. వికారం, అలసట ఉన్నప్పుడు ఓ కప్పు అల్లం టీ తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అల్లంలోని జింజిబర్ అనే పదార్థం హానికర బ్యాక్టీరియాని తొలగించి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
డయాబెటిస్ వారికి..
అల్లం టైప్ 2 డయాబెటీస్ వ్యాధి ఉన్న వారికి షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. అల్లం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అల్లం టీ తాగితే దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడంలో అల్లం టీ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే అన్నింటికి మంచి కదా అని ఎక్కువగా తాగడం వల్ల అనర్థాలు కూడా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అల్లం ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంటగా ఉండి.. చికాకు కలిగిస్తుంది. అందుకే తగిన మోతాదులో తీసుకోవడం మంచిది.
ఇవి కూడా చదవండి:
Hand Numbness: మీకు తిమ్మిర్లు ఎక్కువగా వస్తున్నాయా..? కారణాలు ఏమిటి.. వైద్యులేమంటున్నారు..?
Carrots Benefits: క్యారెట్‌తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..? గుండె ఆరోగ్యానికి మంచి ఔషధం..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3EO1uoK


0 Response to "Ginger Tea: ప్రతి రోజు ఉదయాన్నే అల్లం టీ తాగితే ఎన్నో ఉపయోగాలు.. తెలిస్తే తాగకుండా ఉండలేరు..!"
Post a Comment