-->
Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రోజు రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షల బెనిఫిట్‌.. ఎలాగంటే..

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రోజు రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షల బెనిఫిట్‌.. ఎలాగంటే..

Post Office

Post Office: పోస్టాఫీసుల్లో ఎన్నో రకాల స్కిమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ రాబడి వచ్చే విధంగా స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. కస్టమర్లు రాబడి పొందే విధంగా పోస్టల్‌ శాఖ వివిధ రకాల పథకాలను ప్రవేశపెడుతోంది. పోస్టాఫీసులో ఉండే వివిధ రకాల స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో డబ్బుల్లో పెట్టడం వల్ల రిస్క్ లేకుండానే రాబడి పొందే పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

అలాగే పోస్టాఫీస్‌లో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా పొందవచ్చు. పోస్టాఫీసు ప్రవేశపెట్టిన స్కీమ్‌లలో ‘గ్రామ్ సురక్ష స్కీమ్’ కూడా ఒకటుంది. మరణం తర్వాత మెచ్యూరిటీ ప్రయోజనాలతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అలాగే రెండు రకాల బోనస్‌లు కూడా ఇందులో చేర్చారు. ఈ గ్రామ సురక్ష స్కీమ్‌ను లైఫ్ అస్యూరెన్స్ పాలసీ అని కూడా అంటారు.

ఈ స్కీమ్‌ తీసుకునేందుకు ఎవరెవరు అర్హులు:
19 ఏళ్ల వయసు ఉన్న వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. 55 ఏళ్ల వరకు వయసులో ఉన్న వారు ఈ పాలసీ పొందటానికి అర్హులు. కనీసం రూ.10 వేల మొత్తానికి బీమా తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.10 లక్షల వరకు బీమా మొత్తానికి పాలసీ తీసుకునే అవకాశం ఉంటుంది. పాలసీ తీసుకున్న నాలుగేళ్ల తర్వాత లోన్ ఫెసిలిటీ కూడా లభిస్తుంది.

ఈ పాలసీపై ఇండియా పోస్టల్ రూ.1000కి రూ.60 బోనస్ అందించింది. అంటే రూ.లక్షకు ఏడాదికి రూ.6 వేల బోనస్ వచ్చినట్లు అవుతుంది. ఈ పథకాన్ని మూడు సంవత్సరాలల తర్వాత కూడా సరెండర్‌ చేసుకోవచ్చు. ఐదేళ్లలోపు మీరు గ్రామ సురక్ష పథకాన్ని ముగించుకుంటే బోనస్‌ ప్రయోజనం లభించదు.

ఇందులో మూడు ప్రీమియం చెల్లింపులు ఎంపిక చేయబడ్డాయి. 55 సంవత్సరాలు, 58 సంవతస్రాలు, 60 సంవత్సరాలు. ఎవరైనా ఈ పథకానికి 19 ఏళ్ల వయసులో నమోదు చేసుకుంటే అతని ప్రీమియం టర్మ్‌ 36 సంవత్సరాలు, 39 సంవత్సరాలు, 41 సంవత్సరాలు. అతను 55,58 లేదా 60 ఏళ్ల వయసులో తీసుకుంటే మెచ్యూరిటీ మొత్తం దాదాపు 35 లక్షలు ఉంటుంది.

19 ఏళ్ల వయసులో 10 లక్షల బీమాతో కూడిన సురక్ష పాలసీని కొనుగోలు చేసినప్పుడు 55 సంవత్సరాల నెలవారీ ప్రీమియం రూ.1515, 58 సంవత్సరాలకు రూ.1463, 60 సంవత్సరాలకు రూ.1411, 55 సంవత్సరాల మెచ్యూరిటీ బెనిఫిట్‌ రూ.31.60 లక్షలు రూ.58 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్‌ రూ.33.40 లక్షలు, 60 ఏళ్ల మెచ్యూరిటీ బెనిఫిట్‌ రూ.34.60 లక్షలు ఉంటుంది.

నామినీ సౌకర్యం:
గ్రామ సురక్ష పాలసీలో నామినీ సౌకర్యం కూడా ఉంది. కస్టమర్‌ ఇ-మెయిల్‌ ఐడి లేదా మొబైల్‌ నెంబర్‌ను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. మీకు సమీపంలో ఉన్న పోస్టాఫీసును సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. ఏవైనా సందేహాలుంటే టోల్‌ ప్రీ నెంబర్‌ 1800 180 5232/155232కు కాల్‌ చేయవచ్చు. లేదా వెబ్‌సైట్‌  ద్వారా కూడా పూర్తి సమాచారం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి:

GST: భారతదేశంలో జీఎస్టీలో మూడు రకాలు.. సీజీఎస్టీ, స్టేట్‌జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ.. వీటి అర్థాలు ఏంటంటే..!

Low CIBIL Score: మీకు సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉందా..? రుణం పొందడం ఎలా..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3GM0iEp

0 Response to "Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రోజు రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షల బెనిఫిట్‌.. ఎలాగంటే.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel