-->
Delhi Capitals IPL 2022 Retained Players: ఢిల్లీ టీమ్‌ నుంచి అశ్విన్, రహానే, అయ్యర్ ఔట్.. ఈ నలుగురు ప్లేయర్లకు ఓకే..!

Delhi Capitals IPL 2022 Retained Players: ఢిల్లీ టీమ్‌ నుంచి అశ్విన్, రహానే, అయ్యర్ ఔట్.. ఈ నలుగురు ప్లేయర్లకు ఓకే..!

Delhi

Delhi Capitals IPL 2022 Retained Players: ఐపీఎల్‌-2022 మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంఛైజీలు తాము రిటైన్‌ చేసుకునే ఆటగాళ్ల జాబితాను మంగళవారం ప్రకటించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తాను రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను వెల్లడించింది. నలుగురు ప్లేయర్లను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకుంది. ఇందులో రిషబ్ పంత్, అక్షర్ పటేల్, అన్రిచ్ నార్ట్జే, పృథ్వీ షా పేర్లు ఉన్నాయి. రిషబ్ పంత్‌ను కెప్టెన్‌గా కొనసాగించనున్నారు. పృథ్వీ షాను భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కొనసాగిస్తున్నారు. తనదైన శైలిలో బ్యాటింగ్‌ ఇరగదీస్తున్న నేపథ్యంలో.. అతన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది జట్టు యాజమాన్యం.

అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ కొంతమంది కీలక ప్లేయర్లను వదులుకుంది. అజింక్య రహానే, స్టీవ్ స్మిత్, ఆర్ అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, శిఖర్ ధావన్ ఉన్నారు. వీరితో పాటు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను కూడా రిటైన్ చేయలేదు. వాస్తవానికి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యరు ఉండాలనుకుంటున్నాడని, అయితే పంత్‌ను కెప్టెన్‌గా ఉంచాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందని టాక్. ఈ నేపథ్యంలోనే అయ్యర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేయలేదు.

ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసిన ప్లేయర్స్ వీరే..
రిషబ్ పంత్ చాలా కాలంగా జట్టులో ఉన్నాడు. IPL 2021 సీజన్‌లో జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. అతని సారథ్యంలోనే జట్టు ప్లేఆఫ్‌ వరకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే టీమ్ యాజమాన్యం రిషబ్ పంత్‌ని రిటైన్ చేసింది. తద్వారా రిషబ్ పంత్‌కు రూ. 16 కోట్లు వస్తాయి.
పృథ్వీ షా – యువ ఆటగాడు. ఓపెనర్. 7.5 కోట్ల రూపాయలు వస్తాయి.

ఎన్రిక్ నోర్సియా – అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. స్కింపీ బౌలింగ్, 150 కంటే ఎక్కువ వేగంతో బంతిని విసిరే సత్తా ఉన్నోడు. నోర్కియాకు 6.5 కోట్ల రూపాయలు వస్తాయి.
అక్షర్ పటేల్ – ఆల్ రౌండర్. ఎకనామిక్ బౌలింగ్‌తో లోయర్ ఆర్డర్‌లో భారీ స్కోరు చేయగలడు. 9 కోట్ల రూపాయలు అందుతాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకున్న ప్లేయర్స్ వీరే..

శ్రేయాస్ అయ్యర్, స్టీవ్ స్మిత్, అజింక్యా రహానే, ఆర్ అశ్విన్, మార్కస్ స్టోయినిస్, శిఖర్ ధావన్, సామ్ బిల్లింగ్స్, షిమ్రాన్ హెట్మెయర్, రిప్పల్ పటేల్, విష్ణు వినోద్, అవేశ్ ఖాన్, టామ్ కరణ్, లలిత్ యాదవ్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ దుబే, ప్రవీంత్ శర్మ, కగిసో రబడా, లుక్మాన్ మెరివాలా, క్రిస్ వోక్స్, బెన్ ద్వార్షిష్, కుల్వంత్ ఖేజ్రోలియా, ఎం సిద్ధార్థ.

Also read:

మందుబాబుల మత్తు వదల కొడతాం..ఇల్లీగల్ డీ అడిక్షన్‌ రీహాబిలిటేషన్‌ సెంటర్ల అక్రమ దందా.. టీవీ9 నిఘాలో విస్తుకొలిపే నిజాలు!

Business Idea: వాటే ఐడియా గురూ.. తండ్రి ఆసక్తి.. తనయుని వ్యాపారం.. కోట్లాది రూపాయల టర్నోవర్..

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్‌తో థర్డ్ వేవ్ వస్తుందా? కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ అంచనా..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/31g2tjl

Related Posts

0 Response to "Delhi Capitals IPL 2022 Retained Players: ఢిల్లీ టీమ్‌ నుంచి అశ్విన్, రహానే, అయ్యర్ ఔట్.. ఈ నలుగురు ప్లేయర్లకు ఓకే..!"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel