
Anand Mahindra: టీనేజ్‌లోకి వెళ్లిపోయిన ఆనంద్ మహీంద్రా.. లాంగ్‌డ్రైవ్ జ్ఞాపకాలను పంచుకుంటూ ట్వీట్..

ప్రముఖ వ్యాపారవేత్త సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లే్దు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఏదో ఒక విషయంపై తనదైన శైలిలో స్పందిస్తుంటారీ బిజినెస్ టైకూన్. తన పోస్టులతో సమాజంలో మనకు తెలియని ఎంతోమంది స్ఫూర్తిదాయక వ్యక్తుల జీవితాలను పరిచయం చేస్తుంటారు. అలాగే నెట్టింట్లో ట్రెండింగ్‌లో ఉన్న విషయాలపై మాట్లాడుతుంటారు. అలా తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పోస్టును షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. తను యవ్వనంలో ఉన్నప్పటి ఫొటోను ట్విట్టర్‌లో పంచుకుంటూ అప్పటి జ్ఞాపకాల దొంతరలోకి వెళ్లిపోయారు.
ట్రక్కులో పాటలు ఆలపిస్తూ..
‘నేను యువకుడిగా ఉన్నప్పుడు వారాంతాల్లో ఎలా ఉండేవాడినో మరోసారి గుర్తుచేసుకుంటున్నాను . 1972లో నా వయసు 17 సంవత్సరాలు. అప్పుడు స్నేహితుడితో కలిసి తరచూ ముంబయి నుంచి పుణెకు ట్రక్కుల్లో వెళ్లేవాడిని. అప్పుడే లాంగ్ డ్రైవ్‌లో ఉన్న మజా నాకు తెలిసింది. ‘పరిచయ్’ సినిమాలోని ‘ముసాఫిర్ హూన్ యారో’ పాటను ఆలపిస్తూ ట్రక్కుపై ప్రయాణించేవాళ్లం’ అని అప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నారు ఆనంద్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆనంద్ మహీంద్రా లాగే నెటిజన్ల తమ చిన్నప్పటి జ్ఞాపకాలను పంచుకుంటున్నారు.
Remembering the best weekends of my youth. In ‘72 -I was 17-a friend & I used to often hitchhike from ‘Bombay’ to ‘Poona’ taking rides on trucks. That’s probably when I developed my love for the open road..The movie ‘Parichay’ had come out & we would sing “Musafir hoon Yaaron’
pic.twitter.com/VuTvMTyivd
— anand mahindra (@anandmahindra) November 13, 2021
Also Read:
Viral Video: ఇదో “గొర్రె కథ’! ఆ రైతు ఇంట కాసుల పంట !! వీడియో
భార్యకు ప్రేమతో.. చనిపోయినా ఇంట్లో ఉంచి పూజలు.. వీడియో
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3Fd9hNe
0 Response to "Anand Mahindra: టీనేజ్‌లోకి వెళ్లిపోయిన ఆనంద్ మహీంద్రా.. లాంగ్‌డ్రైవ్ జ్ఞాపకాలను పంచుకుంటూ ట్వీట్.."
Post a Comment