-->
Karnataka: విషాదం.. కర్ణాటకలో ఇల్లు కూలి ఏడుగురి మృతి..

Karnataka: విషాదం.. కర్ణాటకలో ఇల్లు కూలి ఏడుగురి మృతి..

House Collapse

Karnataka: వర్షాకాలంలో అప్పుడప్పుడు శిథిలావస్థలో ఉన్న ఇళ్లు కూలిపోతూ ఉంటాయి. ఎందుకంటే వాటి గోడలు చాలాకాలం నాటివి. రెండు, మూడు రోజులు వర్షం కురిస్తే గోడలు నాని ఉంటాయి. దీంతో ఎప్పుడు కూలుతాయో కూడా తెలియకుండా ఉంటుంది. అందుకే పాతకాలం ఇళ్లలో ఉండే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. లేదంటే చాలా ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. తాజాగా మన పక్కరాష్ట్రం కర్ణాటకలో ఇదే జరిగింది. పురాతన ఇంట్లో నివసించడంతో ఇల్లు కూలి ఏడుగురు అక్కడికక్కడే మరణించారు.

కర్ణాటకలోని బెళగావి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా బెళగావిలోని బదల అంకాలగి గ్రామంలో ఓ ఇల్లు కూలి అందులో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. పురాతన ఇల్లు కావడంతోనే వర్షానికి తడిసిపోయి కూలిపోయినట్లు చెబుతున్నారు. సమాచారం అందుకున్న సీఎం బసవరాజ బొమ్మై విచారం వ్యక్తం చేశారు. మృతి చెందినవారికి పరిహారం ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున చనిపోయినవారి కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నట్లు తెలిపారు.

దారుణమైన ఘటన జరగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకేసారి ఏడుగురు మరణించడం అంటే సాధారణ విషయం కాదు కదా.. అందుకే పాత ఇళ్లలో నివసించేవారు ఇప్పటికైనా ఇల్లు మారండి. లేదంటే ఏ క్షణంలో ఏం జరగుతుందో ఎవ్వరికి తెలియదు. ఆర్థికంగా లేకుంటే ప్రభుత్వం సాయం పొందైనా సరే పక్కా ఇల్లు కట్టుకోండి.

Nagarkurnool : ఏనాడు విధులకు రాని డాక్టర్‌.. 4ఏళ్లుగా జీతభత్యాలు.. అసలు కథా ఏంటంటే..?(వీడియో)



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2YmOEOr

Related Posts

0 Response to "Karnataka: విషాదం.. కర్ణాటకలో ఇల్లు కూలి ఏడుగురి మృతి.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel