-->
Shivani Rajasekhar: ఆ సమయంలో చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శివాని రాజశేఖర్‌.

Shivani Rajasekhar: ఆ సమయంలో చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శివాని రాజశేఖర్‌.

Shibani Rajashekar

Shivani Rajasekhar: సీనియర్‌ రాజశేఖర్‌ పెద్ద కూతురు శివాని రాజశేఖర్‌ నటించిన తొలి చిత్రం ‘అద్భుతం’ విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. టైమ్‌ ట్రావెలర్‌లాంటి విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 19న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ వేదికగా విడుదల కానుంది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే నిజానికి శివాని ఇప్పటికే.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా ఆ సినిమాలు ఆగిపోయాయి. అడవిశేష్‌తో ‘టూ స్టేట్స్‌’, తమిళంలో విష్ణు విశాల్‌తో ఓ సినిమా.. ఇలా రెండు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. అయితే ఎట్టకేలకు తొలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందు సిద్ధమైంది శివాని. ఇక సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివాని తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

ఈ సందర్భంగా శివాని మాట్లాడుతూ.. ‘స్టార్‌ కిడ్స్‌ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇండస్ట్రీలో సులభంగా రాణిస్తుంటారని అనుకుంటుంటారు. అందరికి ఏమో కానీ నా విషయంలో మాత్రం అలా జరగలేదు. కెరీర్‌ ఆరంభంలోనే అవాంతరాలు ఎదురైతే ఇండస్ట్రీలో బ్యాడ్‌లక్‌, ఐరన్‌లెగ్‌ అనే ముద్రలు వేస్తుంటారు. ఏ సినిమా మొదలుపెట్టినా ఆగిపోవడంతో నాకు నేనే ఐరెన్‌లెగ్‌గా భావించుకున్నా. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. కానీ అమ్మానాన్నల ప్రోత్సాహం, ధైర్యం వల్లే కష్టాల్ని సవాల్‌గా స్వీకరించి ధైర్యంగా నిలబడ్డా’ అని చెప్పుకొచ్చారు.

ఇక సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడం వల్ల ప్లస్‌తో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చింది శివాని. ఇక తన చెల్లి శివాత్మికను ఎప్పుడూ పోటీగా భావించనని చెప్పుకొచ్చిన శివాత్మిక.. తాము ఎప్పుడూ మంచి స్నేహితుల్లానే ఉంటామని, ఇద్దరూ నటననే ఎంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాని శివాని చెప్పుకొచ్చింది.

Also Read: Krithi Shetty: తన అందాలతో ఫాన్స్ కి కనులు విందు చేస్తున్న కృతి శెట్టి..

సామాన్యులకు మరో షాక్‌.. ఈ వస్తువుల ధరలు పెరుగుతాయట.. వెలువడుతున్న నివేదికలు..!

సామాన్యులకు మరో షాక్‌.. ఈ వస్తువుల ధరలు పెరుగుతాయట.. వెలువడుతున్న నివేదికలు..!



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3Cn9ThC

0 Response to "Shivani Rajasekhar: ఆ సమయంలో చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శివాని రాజశేఖర్‌."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel