
ABSL Business Cycle NFO: ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ సైకిల్ ఎన్ఎఫ్ఓ.. ఎలా ఉంటుందంటే..

Business Cycle NFO: ఆదిత్యబిర్లా సన్ లైవ్ నుంచి బిజినెస్ సైకిల్ఎన్ఎఫ్ఓ నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ ఫండ్ ఎన్ఎఫ్ఓ నవంబర్ 15న ప్రారంభమై 29న ముగుస్తుంది. ఈ ఫండ్ గురించి ఆదిత్యబిర్లాగ్రూప్ సీఈఓ మహేష్ పాటిల్ వివరించారు. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు ఆశాజనకంగాఉన్నాయి. దీంతో రెగ్యులర్ ఇన్వెస్టర్లతోపాటు యువతరం కూడా వివిధ మార్గాల్లో ఇన్వెస్ట్ సేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ల వైపు పెట్టుబడిదారులు ఆకర్షితులవుతున్నారు. ఇటీవలికాలంలోఅనేక కంపెనీలు ఐపీఓలు మార్కెట్లోకి ప్రవేశించాయి. వీటిలో పెట్టుబడుల ప్రవాహం నడుస్తోంది. ఇప్పుడు, ఎన్ఎఫ్ఓ (న్యూఫండ్ఆఫర్) కూడా బిజినెస్ సైకిల్ ఎంటర్ అయింది. ఎన్ఎఫ్ఓ అనేది ఒకరకమైన ఆల్-వెదర్ ఫండ్. సెక్టోరల్థీమాటిక్ ఫండ్ వలే కాకుండా ఇది భిన్నంగా పనిచేస్తుంది. ఈ కొత్త ఫండ్ గురించి ఆదిత్యబిర్లాసన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ మహేష్ పాటిల్అనేక విషయాలు క్లుప్తంగా వివరించారు. మనీ9 కన్సల్టింగ్ ఎడిటర్ వివేక్ నిర్వహించిన ఇంటర్వ్యూలో అనేక కొత్త విషయాలు చెప్పుకొచ్చారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితిపై తన ఐడియాలనుపంచుకున్నారు. ఈరోజు ఆదిత్యబిర్లా గ్రూప్ ప్రారంభించిన ఎన్ఎఫ్ఓ ఫండ్ దగ్గర నుంచి అనేక విషయాలు చెప్పారు. అవేంటో చూద్దాం.
ప్రశ్న: ప్రస్తుతం మార్కెట్ సెన్సెక్స్, ఇన్ఫీలు 60- నుంచి 62000 స్థాయిలనుదాటుతున్నందున ఈర్యాలీ ఇంకెంతకాలం కొనసాగేఅవకాశంఉంది? ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా?
సమాధానం: అవును. మహమ్మారి సమయంలో దిగువకుపడిపోయిన మార్కెట్ ఒక్కసారిగా వేగంపుంజుకుంది. ఒకటిన్నరసంవత్సరాలుగా ఆశాజనంకగాలేని మార్కెట్లు అనూహ్యంగా బాగా వృద్ధి చెందాయనడంలో ఎటువంటి సందేహంలేదు. ప్రస్తుతం రికవరీ చాలా వేగంగా ఉంది. అయితే, ఈవృద్ది ఇంకా ఎంతకాలం ఉంటుంది? ఒక్కసారిగా మార్కెట్ కుప్పకూలే పరిస్థితిఉందా? అనేది అందరిలోనూ మెదులుతున్న సందేహం. ఈకారణంగానే కొందరు మార్కెట్ నంచి నిష్క్రమించాలని ఆలోచిస్తున్నారు. అయితే, మా అంచనా ప్రకారం రాబోయే కొన్నిసంవత్సరాలపాటు మార్కెట్ చాలా బలమైన ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తుంది. ఈవృద్ధి ఇన్వెస్టర్లకు సానుకూల పరిణామంగానే చెప్పవచ్చు. అందువల్ల, మీపెట్టుబడులను కొంతకాలం పాటు అలాగే కొనసాగించడం మంచిది. అయితే దీర్ఘకాలికపెట్టుబడులు పెట్టడం ఇంకాఉత్తమం. ఎందుకంటే, ఆర్థికవ్యవస్థ కోలుకోవడం, కార్పొరేట్ఆదాయాలు వృద్ధిచెందడం అనేవి దీర్ఘకాలంలో జరుగుతుంటాయి. ప్రస్తుతం తరుణంలో కార్పొరేట్ లాభాలు మెరుగుపడేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ఈసంవత్సరం, మేముదాదాపు 35% ఆదాయవృద్ధిని కనబర్చాం. రాబోయే రోజుల్లో ఈవృద్ధి మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రశ్న: ఈక్విటీ పెట్టుబడులు ఉపసంకరించుకోవడం మంచిదేనా? మార్కెట్ వృద్ధి ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నాయి?
సమాధానం: రిస్క్ అసెట్ క్లాస్ లేదా ఈక్విటీలో నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవడం చాలా సులభం. కానీ, ఒక్కసారిగా దీన్ని ఉపసంహరించుకోలేము. సెంట్రల్ బ్యాంక్, ప్రభుత్వాలు క్రమక్రమంగా పెట్టుబడి వెనక్కు తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. మార్కెట్ ఆశాజనకంగా లేనప్పుడు మీఫండ్ ఉపసంహరించుకోవడం మంచిది. అదేక్రమంలో, మార్కెట్ వృద్ధి చెందినప్పుడు మళ్లీ పెట్టుబడి పెట్టండి. తద్వారా అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుంది. మీ ప్రతి ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ పరిస్థితికిలోబడి ఉండేలా చూసుకోండి.
ప్రశ్న: ఇటీవలికాలంలో సిప్‌లో పెట్టుబడులు భారీగాపెరుగుతున్నాయి. నెలవారీ సిప్ పెట్టుబడులు రూ.10,000 కోట్లనుదాటాయి. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? మీ అంచనా ఏమిటి?
సమాధానం: డైరెక్ట్ ఈక్విటీలో మాత్రమే కాకుండా మ్యూచువల్ ఫండ్ వైవు నుంచి కూడా ఈక్విటీలలోకి పెట్టుబడిల ప్రవాహం పెరుగుతోంది. దీనికి అనేక కారణాలున్నాయి. కరోనా కారణంగా చాలా మంది వర్క్ ఫ్రమ్ విధానంలో పని చేస్తున్నారు. అందువల్ల, ఎక్కువ మందికి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి సమయం లభిస్తుంది. కొత్తవారు మార్కెట్లోకి ప్రవేశిస్తుండటం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. మరోవైపు, బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గించడం కూడా స్టాక్ మార్కట్లో పెట్టుబడులు పెరగడానికి మరో కారణం.
ప్రశ్న: ఒక వ్యక్తి కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించాలనుకుంటే ఇది సరైన సమయమేనా? మరి కొంతకాలం వేచి చూడాలా? ఇప్పుడే ప్రారంభించడం మంచిదా? మీ సలహా ఏమిటి?
సమాధానం: ప్రస్తుతం మార్కెట్ఆశాజనకంగాఉన్నందున కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చేవారికి ఇది మంచి సమయమే. అయితే, మార్కెట్ అంచనా వేసి మాత్రమే పెట్టుబడి పెట్టాలి. లేదంటే పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంది. రిస్క్ తీసుకోకూడదు అనుకునే వారు సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్(SIP)ను ఫాలోఅవ్వడంఉత్తమం.
ప్రశ్న: మీరు తాజాగా ప్రారంభించిన న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) గురించి ఏం చెబుతారు? మేము ఇప్పటి వరకు న్యూఇండెక్స్ ఫండ్లు, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లు మొదలైన వాటి గురించి విన్నాం. గత 12 నెలల నుంచి మాత్రమే ఈ ఎన్ఎఫ్ఓ ఫండ్ల గురించి వింటున్నాం. ఈ బిజినెస్ సైకిల్ ఎన్ఎఫ్ఓ గురించి చెప్పండి.
సమాధానం: ఆదిత్య బిర్లా గ్రూప్ వివిధ థీములు లేద్ ఉత్వత్తులను మార్కెట్లోకి ప్రవేశపెట్టడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడిదారులకు ప్రయోజనాలు చేకూర్చేలా ఫండ్స్ ఆఫర్ చేస్తుంటాం. తాజాగా మేము ప్రారంభించిన న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) కూడా అదేకోవాలోకి వస్తుంది. మార్కెట్ సరైనవి అని మేము భావించిన సమయంలో మేము గతంలో ఇతర థీమాటికల్ ఫండ్లు లేదా సెక్టార్ ఫండ్లు ప్రారంభించాం. వాటికి గణనీయమైన స్పందన వచ్చింది. ఇప్పుడు బిజినెస్ సైకిల్ ఫండ్ అయిన న్యూ ఫండ్ ఆఫర్(ఎన్ఎఫ్ఓ)ను ప్రారంభిస్తున్నాం. ఏది ఏమైనా ప్రస్తుతం మార్కెట్ టైమింగ్ బాగుందని నేను భావిస్తున్నాను. దీనిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభాలా వస్తాయని ఆశాభావంతో ఉన్నాం. అయితే, ఆర్థిక వ్యవ స్థక్షీణించినప్పుడు లేదా మందగించినప్పుడు, రక్షణ రంగాలు బాగా చేయగలవు. ఇది దేశ రక్షణకు తీవ్ర ఆటంకం ఏర్పరుస్తుంది. అందుకే ఆర్థికచక్రంలో మనం ఏ దశ లేదా ఏ చక్రంలోఉన్నామో అర్థం చేసుకోవాలి. ఆపై ఇతర రంగాలు లేదా వ్యాపారాల్లో పెద్ద కేటాయింపులు జరపాలి. ఫోర్ట్ఫోలియోన్ విస్తరించి స్టాక్ మార్కెట్లో లాభాలు గడించాలి. ఇప్పటికే, మీరు ఒక రకమైన పాపులేషన్ మార్కెట్లోఉన్నట్లయితే, ఫండ్ నెమ్మదిగా మరింత డిఫెన్సివ్ల వైపు సర్దుబాటు చేయడం ప్రారంభించండి. ఫోర్ట్‌ఫోలియోలో సరైన బ్యాలెన్స్ సృష్టించండి. మేం ఇతర డైవర్సి ఫండ్లు, ఇతర ఫ్లెక్సీక్యాప్ ఫండ్లను కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మేము ఒక రకమైన టాప్-డౌన్ విధానాన్నే అనుసరిస్తున్నాం.
ప్రశ్న: ఏ సమయంలో మీరు ఎన్నిసెక్టార్లపై దృష్టి సారిస్తారు? మీరు చెప్పినట్లుగా ఇతర విభిన్నమైన ఫండ్లు ఎలాంటి లాభాలు తెచ్చిపెడతాయి? మీ మునుపటి ఫండ్లను ఈకొత్త ఫండ్ ఎలా వేరుచేస్తుంది?
సమాధానం: ఇక్కడ పెట్టుబడి సెక్టార్లవిషయంలోఎటువంటి లాజిక్ లేదు. ఫండ్ కేటాయింపులు పూర్తిగా మార్కెట్ పరిస్థితిని బట్టి చేయాలి. ఉదాహరణకు ఆర్థిక వ్యవస్థలో విస్తరణదశలో ఉన్నక్రమంలో, మీరునాన్-సైక్లిక్ సె క్టార్లలో ఇన్వెస్ట్ చేయడం లాభిస్తుంది. అది కమోడిటీ లేదాక్యాపిటల్ గూడ్స్ రంగం లేదా బ్యాంకింగ్ రంగం లేదా సేవ రంగం కావచ్చు. మీకు మంచి లాభాలు తెచ్చిపెడతాయి.
ప్రశ్న: ఎన్ఎఫ్ఓ ఫండ్ ఎలాంటి పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుంది? మీరు దీన్ని హైరిస్క్ ఫండ్‌గా పరిగణిస్తారా?
సమాధానం: న్యూఫండ్ఆఫర్(ఎన్ఎఫ్ఓ) మల్టీ-క్యాప్ ఫండ్ లేద్ ఫ్లెక్సీ-క్యాప్ ఫండ్‌తో సమానంగా ఉంటుంది. కొంత వరకు వైవిధ్యభరితంగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. నిర్దిష్ట సమయంలో ఒక నిర్దిష్టరంగంపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. కానీమార్కెట్ల నలువైపులా కాకుండా ఈ ఫండ్ వివిధ రంగాల చుట్టూ కదులుతుంది. మీరు నిర్దిష్టంగా ఏ రంగంపై ఎక్కవకాలం స్థిరపడలేరు. చాలా మంది పెట్టుబడిదారులకు న్యూ ఫండ్ ఆఫర్ బెస్ట్ ఆప్షన్. మరితం వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో కోరుకునేవారికి ఇది సరిపోతుంది. నిర్దిష్ట సమయాలలో కొంత ఎక్కువ సెక్టార్ ఏకాగ్రతను కలిగి ఉన్నవాస్తవాన్ని పరిగణనలో కితీసుకుంటే, రిస్క్ సాధారణ డైవర్స్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయితే, ఎక్కువ రిస్క్ ఉన్నఫండ్లలో పెట్టుబడి ద్వారా ఎక్కువ మొత్తంలో లాభాలు గడించవచ్చు.
Sector disclaimer- The sector(s) mentioned herein do not constitute any research report/recommendation of the same and the Fund may or may not have any future position in these sector(s).
Read Also.. సామాన్యులకు మరో షాక్.. ఈ వస్తువుల ధరలు పెరుగుతాయట.. వెలువడుతున్న నివేదికలు..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3qE4d0s
0 Response to "ABSL Business Cycle NFO: ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ సైకిల్ ఎన్ఎఫ్ఓ.. ఎలా ఉంటుందంటే.."
Post a Comment