
Siddharth: ఆ ఇష్యూలోకి నన్ను లాగొద్దు..! హీరో సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు..

Siddharth: నువ్వొస్తానంటే నెనొద్దంటానా చిత్రంతో తెలుగులో మంచి పేరు సంపాదించుకున్నాడు హీరో సిద్దార్థ్. ఈ సినిమాతో తెలుగు హీరోలకు సైతం పోటీనిచ్చాడీ తమిళ హీరో. ఇక అనంతరం వచ్చిన బొమ్మరిళ్లుతో లవర్ బాయ్‌గా మారాడు. అయితే ఆ తర్వాత సిద్దార్థ్ నటించిన సినిమాలు పెద్దగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఓ మై ఫ్రెండ్ తర్వాత సిద్ధార్థ్ మళ్లీ తెలుగులో నేరుగా సినిమా చేయలేదు. అడపాదడపా ఆయన నటించిన తమిళ సినిమాలే తెలుగులో డబ్ అయ్యి విడదలయ్యాయి.
అయితే తాజాగా దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత సిద్దార్థ్ మళ్లీ తెలుగు ప్రేక్షకకులను పలకరించబోతున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న మహాసముద్రంతో తెలుగులో నటిస్తున్నాడు సిద్దార్థ్. ఈ ఇంటెన్స్ ప్రేమ కథాచిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న సిద్ధార్థ్ సమంత, నాగచైతన్యల ఇష్యూ గురించి కూడా ప్రస్తావించారు. నాగచైతన్య – సమంత విషయంలోకి తనని లాగొద్దన్నారు. ఆ సమయంలో తాను చేసిన ట్వీట్ అంతగా ఎందుకు వైరల్ అయిందో కూడా తనకు తెలియదన్నారు.
“మోసం చేసేవాళ్లు ఎప్పుడూ బాగుపడరు.. చిన్నప్పుడు నేను స్కూల్లో టీచర్ దగ్గర మొదట నేర్చుకుంది అదే. మరి మీరేం నేర్చుకున్నారు..? ” అనేది ఆ ట్వీట్ అర్థం. అయితే అందరు ఆ ట్వీట్‌ని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎవరి గురించో తాను ఆ ట్వీట్ చేయలేదని ఆ వ్యవహారంలోకి నన్ను లాగొద్దని సిద్ధార్థ్ వివరించారు. తాను చిన్నప్పటి నుంచి బుక్స్ చదివానని, చాలా నేర్చుకున్నానని.. టీచర్ దగ్గర నేర్చుకున్న విషయమే తాను చెప్పినట్లు సిద్దార్థ్ చెప్పుకొచ్చాడు. నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ ఈ నెల 2న తాము విడిపోతున్నట్లు సమంత, నాగచైతన్య ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అదే రోజున సిద్దార్థ్ ఈ ట్వీట్ చేయడంతో అందరు సమంత గురించే ట్వీట్ చేశాడని అనుకున్నారు.
One of the first lessons I learnt from a teacher in school…
“Cheaters never prosper.”
What’s yours?
— Siddharth (@Actor_Siddharth) October 2, 2021
Maa Elections 2021: ఎక్స్‌ట్రాలు ఆపండి..! నరేశ్ వ్యాఖ్యలపై శ్రీకాంత్ సీరియస్..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3iOGUfD
0 Response to "Siddharth: ఆ ఇష్యూలోకి నన్ను లాగొద్దు..! హీరో సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు.."
Post a Comment