
ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్..! రావణుడి పాత్ర ముగిసింది.. రాముడు కొనసాగుతున్నాడు..?

Adipurush Update: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబినేషన్‌లో ఆదిపురుష్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపిస్తుండగా సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. అలాగే రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ని దర్శకుడు ఓంరౌత్ అభిమానులతో పంచుకున్నారు.
రావణుడి పార్ట్ చిత్రీకరణ పూర్తైయినట్లు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘నీతో చిత్రీకరణ సరదాగా సాగింద’ని సైఫ్‌కు సెట్లో వీడ్కోలు పలుకుతున్న ఫోటోలను షేర్ చేసారాయన. ఈ నెలాఖరులోపు ప్రభాస్ పార్ట్ కూడా పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రబృందం బిజీ అవనున్నట్లు సమాచారం. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది ఆగస్టు 11న ‘ఆదిపురుష్’ థియేటర్లలోకి రానుంది.
తెలుగుతో పాటు.. హిందీ, మళయాలం, కన్నడ, తమిళ్ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. ఇందులో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపిస్తారు. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ ఎక్స్పర్ట్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే కాకుండా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ చేస్తున్నాడు ప్రభాస్. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పూజాహెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
It’s a film wrap for Lankesh!!! Had so much fun shooting with you SAK!!!#SaifAliKhan #Adipurush #AboutLastNight pic.twitter.com/WLE8n0Ycu7
— Om Raut (@omraut) October 9, 2021
MAA Elections 2021: క్లైమాక్స్‌కి చేరిన ‘మా’ ఫైట్.. మోనార్క్ vs మంచు ప్యానళ్లు ఢీ అంటే ఢీ.. 28 ఏళ్ల ‘మా‘ ప్రస్థానం సాగిందిలా..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3aqw4ro
0 Response to "ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్..! రావణుడి పాత్ర ముగిసింది.. రాముడు కొనసాగుతున్నాడు..?"
Post a Comment