-->
TDP vs YCP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష.. అనుమతి ఇచ్చిన పోలీసులు..

TDP vs YCP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష.. అనుమతి ఇచ్చిన పోలీసులు..

Chandrababu

TDP vs YCP: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు చేపట్టనున్న నిరవధిక నిరసన దీక్షకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దీక్ష చేపట్టాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు అనుమతులకు సంబంధించి నోటీసులు టీడీపీ నేతలకు అందజేశారు. టీడీపీ కార్యాలయంలో వైసీపీ శ్రేణులు చేసిన దాడికి నిరసనగా.. పార్టీ కార్యాలయంలో 36 గంటల పాటు నిరవధిక నిరసన దీక్ష చేపట్టనున్నట్లు చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పోలీసుల అనుమతి లభించడంతో.. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో పార్టీకి చెందిన కీలక నాయకులు కూడా పాల్గొననున్నారు. మరోవైపు చంద్రబాబు దీక్షా సమయంలో టీడీపీ ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై వినతిపత్రం సమర్పించనున్నారు. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా టీడీపీ నేతలు కలువనున్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలపై, పార్టీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులను ఆయనకు వివరించనున్నారు.

కాగా, తమ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను టీడీపీ నేతలు దూషించారంటూ వైసీపీ శ్రేణులు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్ మొత్తం ధ్వంసం చేశారు. అలాగే.. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రామ్‌ ఇంటిపైనా వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులను టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ముఖ్య నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ దాడులను నిరసిస్తూ ఇవాళ బంద్ ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా.. రేపటి నుంచి చంద్రబాబు నిరవధిక దీక్ష చేపట్టనున్నారు.

Also read:

TDP vs YCP: పట్టాభికి ఏమైనా అయితే వారిదే బాధ్యత.. పోలీసులపై తీరుపై లోకేష్ ఆగ్రహం..

Taliban Rule: ఇదీ తాలిబన్ల రాక్షసత్వం.. వాలీబాల్ క్రీడాకారిణిని పొట్టనబెట్టుకున్నారు.. ఎందుకంటే..

Zodiac Signs: ఈ రాశుల వారిలో పోటీతత్వం ఎక్కువ.. ఎటువంటి పరిస్థితిలోనూ రాజీ పడరు.. ఆ రాశులేమిటంటే..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2XvIewl

Related Posts

0 Response to "TDP vs YCP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష.. అనుమతి ఇచ్చిన పోలీసులు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel