-->
Chandrababu vs YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. రాష్ట్రపతి, ప్రధాని, హోమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు..

Chandrababu vs YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. రాష్ట్రపతి, ప్రధాని, హోమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు..

Chandrababu Naidu

Chandrababu Letter to PM: ఆంధ్రప్రదేశ్‌లో రాక్షసగణం రాజ్యమేలుతోందని, ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడుతోందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీఎల్పీ నేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు చంద్రబాబు విడివిడిగా లేఖలు రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడంపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఏపీలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని, కేంద్ర బలగాలతో ప్రతిపక్ష పార్టీ నాయకులకు, పార్టీ కార్యాలయాలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, డ్రగ్స్ మాఫియా అరాచకాల గురించి ప్రశ్నించారనే కారణంతో.. టీడీపీ నేతలపై, టీడీపీ కేంద్ర కార్యాలయం సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ ఆఫీసులపై దాడులు చేశారని లేఖలో పేర్కొన్నారు.

వైసీపీ శ్రేణుల దాడులకు సంబంధించిన ఫోటోలు, ధ్వంసమైన పార్టీ కార్యాలయ దృశ్యాలు, దాడుల్లో గాయపడిన టీడీపీ నేతల ఫోటోలు, పేపర్ క్లిప్పింగ్స్, వీడియోలు ఆ లేఖకు అటాచ్ చేసి పంపారు చంద్రబాబు. వీటిని పరిశీలించి.. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏపీలో రాజ్యాంగబద్ధ సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ, మీడియా, రాజకీయ పార్టీలు ఇలా అన్నింటిపై దాడులకు తెగపడుతున్నారంటూ లేఖలో ఆరోపించారు. ఈ దాడులను సీరియస్‌గా పరిగణించి.. తక్షణమే చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తన లేఖలో కోరారు.

Also read:

TDP vs YCP: మంగళగిరి టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు దీక్ష.. అనుమతి ఇచ్చిన పోలీసులు..

TDP vs YCP: పట్టాభికి ఏమైనా అయితే వారిదే బాధ్యత.. పోలీసులపై తీరుపై లోకేష్ ఆగ్రహం..

Taliban Rule: ఇదీ తాలిబన్ల రాక్షసత్వం.. వాలీబాల్ క్రీడాకారిణిని పొట్టనబెట్టుకున్నారు.. ఎందుకంటే..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3jlngba

Related Posts

0 Response to "Chandrababu vs YS Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టండి.. రాష్ట్రపతి, ప్రధాని, హోమంత్రికి లేఖ రాసిన చంద్రబాబు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel