-->
TRS: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ, మధ్యాహ్నం ఎల్పీ మీటింగ్

TRS: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ, మధ్యాహ్నం ఎల్పీ మీటింగ్

Kcr

TRS: తెలంగాణ భవన్‌లో ఈ మధ్యాహ్నం టీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ నెల 25న జరగనున్న పార్టీ జనరల్ బాడీ మీటింగ్.. ప్లీనరీ పై ఈ సమావేశంలో చర్చ జరుగనుంది. మరోవైపు, పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు ఈ రోజు నుండి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఇక, ఉదయం 11 గంటలకు కేసీఆర్ తరపున నామినేషన్లు వేయనున్నారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. 25వ తేదీన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది.

టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నిక నిర్వహణ కోసం రిటర్నింగ్‌ అధికారిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ఎం శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరించనున్నారు. ఆయన ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణభవన్‌లో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తారు.

అనంతరం నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ గ్రామ, మండల, పట్టణస్థాయిల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయ్యింది. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక పూర్తయిన తర్వాత జిల్లా, రాష్ట్ర కమిటీల నిర్మాణం చేపట్టనున్నామని ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read also: Huzurabad by-poll: ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క.. గేర్ మార్చిన టీఆర్‌ఎస్

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2Z0rvSE

Related Posts

0 Response to "TRS: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికకు ఈ రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ, మధ్యాహ్నం ఎల్పీ మీటింగ్"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel