-->
RRR Update: ఎన్నో రోజుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. ఆర్‌.ఆర్‌.ఆర్‌ టీజర్‌ వచ్చేది అప్పుడేనా.?

RRR Update: ఎన్నో రోజుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. ఆర్‌.ఆర్‌.ఆర్‌ టీజర్‌ వచ్చేది అప్పుడేనా.?

Rrr Movie

RRR Update: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఆర్‌.ఆర్‌.ఆర్‌. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగు నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడలేని క్రేజ్‌ ఏర్పడింది. ఇక అపజయం అంటూ ఎరగని రాజమౌళి, బాహుబలిలాంటి అద్భుతం తర్వాత వస్తోన్న చిత్రం కావడం, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై ఒక్క టాలీవుడ్‌ కాకుండా యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ దృష్టి పడింది. ఇదిలా ఉంటే ఇప్పటికే పలుసార్లు విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయడానికి చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఇద్దరు హీరోల ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ సింగిల్‌ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. అయితే ఇవి విడుదలై చాలా రోజులవుతోన్నా ఇప్పటి వరకు మరో అప్‌డేట్‌ మాత్రం రాలేదు. దీంతో అభిమానులు సినిమా టీజర్‌ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్ర టీజర్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆర్‌.ఆర్‌.ఆర్‌ సినిమా టీజర్‌ను అక్టోబర్ 29న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Yellow Fish: పసుపు పచ్చ చేపను ఎప్పుడైనా చూశారా..! ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?

KL Rahul: కేఎల్ రాహుల్ ఔట్‌పై వివాదం.. అంపైర్ నిద్రపోతున్నాడా?.. మండిపడుతున్న నెటిజన్స్

KL Rahul: కేఎల్ రాహుల్ ఔట్‌పై వివాదం.. అంపైర్ నిద్రపోతున్నాడా?.. మండిపడుతున్న నెటిజన్స్



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3b7LLnS

Related Posts

0 Response to "RRR Update: ఎన్నో రోజుల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌.. ఆర్‌.ఆర్‌.ఆర్‌ టీజర్‌ వచ్చేది అప్పుడేనా.?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel