
Railway Recruitment: రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు.. పదోతరగతితో పాటు, ఐటీఐ చేసిన వారు అర్హులు..

Railway Recruitment: రైల్వేలో పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రయాగ్‌రాజ్ ప్రధాన కేంద్రంగా ఉన్న రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ)..నార్త్ సెంట్రల్ రైల్వే(ఎన్‌సీఆర్)లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ ట్రేడుల్లో ఖాళీలుగా ఉన్న అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 1664 పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెకానిక్ ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి.
* అభ్యర్థుల వయసు 01.12.2021 నాటికి 15–24 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను పదో తరగతి,ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 02-11-2021న మొదలు కానుంది.
* దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీగా 01-12-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం రైల్వే రిక్రూట్ సెల్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి..
Also Read: Viral Video: వామ్మో..ఈ పెళ్లికూతురు స్పీడు మామూలుగా లేదు.. వీడియో
Viral Video: సింహాన్ని పరుగులు పెట్టించిన చీతా.. వీడియో
Rohit Sharma: రోహిత్ శర్మ నువ్వు ఇంత చెత్తగా ఆడుతావనుకోలేదు.. మండిపడుతున్న నెటిజన్స్
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3vD4QaY
0 Response to "Railway Recruitment: రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు.. పదోతరగతితో పాటు, ఐటీఐ చేసిన వారు అర్హులు.."
Post a Comment