
Iphone: ఫోన్‌తో పాటు ఛార్జర్ ఇవ్వలేదని.. యాపిల్ సంస్థపై కేసు వేసిన విద్యార్థులు..

Iphone: యాపిల్ సంస్థ ఐఫోన్ కొనుగోలు చేసిన యూజర్లకు ఛార్జర్ ఇవ్వడం లేదు. ఫోన్‌తో పాటు కేవలం యూఎస్‌బీ-సీ లైటెనింగ్ ఇస్తోంది. అయితే ఈ కేబుల్ అన్ని ఛార్జర్లకు సపోర్ట్ చేయడం లేదు. దీంతో యాపిల్ యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ. వేలు పోసి కొన్ని ఫోన్‌కు ఛార్జర్ ఇవ్వకపోవడం ఏంటని పెదవి విరుస్తున్నారు. చేసేదేమి లేక మాగ్‌సేఫ్ ఛార్జర్లు కొనుగోలు చేస్తూ ఫోన్‌లను ఉపయోగించుకుంటున్నారు. అయితే చైనాకు చెందిన కొందరు విద్యార్థులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఈ విషయమై తాడో పేడో తేల్చుకోవడానికి ఏకంగా కోర్టు మెట్లు ఎక్కారు.
వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన ఐదుగురు యూనివర్సిటీ విద్యార్థులు ఇటీవల ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ ఫోన్‌ను కొనుగోలు చేశారు. అయితే అందులో ఛార్జర్ లేదు. దీంతో ఇదే విషయాన్ని తెలుపుతూ కోర్టులో దావా వేశారు. యాపిల్ కొత్తగా తీసుకొస్తున్న మాగ్‌సేఫ్ ఛార్జర్‌ల ప్రచారం కోసమే ఛార్జర్‌లను తొలగించిదని విద్యార్థులు ఆరోపించారు. పరోక్షంగా మాగ్‌సేఫ్ ఛార్జర్లను కొనడం కచ్చితం చేయడం కోసమే యాపిల్ ఈ ఎత్తుగడ వేసిందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే ఈ విషయంపై యాపిల్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ఫోన్‌తో పాటు ఛార్జర్ ఇవ్వడంలేదనే విషయం ఫోన్ బాక్స్‌పై ఉంటుందని, అలాగే ప్రస్తుతం చాలా కంపెనీలు ఫోన్‌తోపాటు ఛార్జర్ ఇవ్వడంలేదని కోర్టుకు తెలిపారు. ఈ విషయమై కోర్టులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. మరి దీనిపై కోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే కర్బన ఉద్గారాలు తగ్గించాలనే ఉద్దేశంతో ఐఫోన్‌తో పాటు ఛార్జర్‌ను ఇవ్వడం లేదని యాపిల్ సంస్థ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read: Telangana: తెలంగాణలో పుర కమిషనర్ల బదిలీలు.. ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి..
Puneeth Rajkumar Death: పునీత్ మరణం పై రామ్ చరణ్ – రోజా ఎమోషనల్ కామెంట్స్..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3pRnKKs
0 Response to "Iphone: ఫోన్‌తో పాటు ఛార్జర్ ఇవ్వలేదని.. యాపిల్ సంస్థపై కేసు వేసిన విద్యార్థులు.."
Post a Comment