-->
Railway: ఆ రైల్వే స్టేషన్ల ప్లాట్‌ఫాం టికెట్‌ చాలా ఖరీదు..! ఎందుకో తెలుసా..?

Railway: ఆ రైల్వే స్టేషన్ల ప్లాట్‌ఫాం టికెట్‌ చాలా ఖరీదు..! ఎందుకో తెలుసా..?

Train

Railway: రైల్వే అధికారులు ముంబైలోని కొన్ని రైల్వే స్టేషన్ల ప్లాట్‌ఫాం టికెట్‌ ధరలు పెంచారు. రూ.10 నుంచి రూ.50 చేశారు. పండుగ సీజన్‌లో ప్రజల రద్దీని తగ్గించడానికి రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల, ముంబై విమానాశ్రయంలో పెద్ద మొత్తంలో జనసందోహం కనిపించింది. దీంతో కరోనా థర్డ్‌ వేవ్‌ ఆందోళన పెరిగింది. అందుకే కరోనా మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్లాట్‌ఫాం టిక్కెట్ల రేట్లను పెంచాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.

ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, దాదర్, లోకమాన్య తిలక్ టెర్మినస్, థానే, కళ్యాణ్, పన్వేల్ వంటి స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరలు పెంచారు. ఈ స్టేషన్లన్నీ ముంబై డివిజన్ పరిధిలోకి వస్తాయి. పెరిగిన ధర నియమం7 అక్టోబర్ నుంచి అమలు చేస్తున్నారు. రైల్వే కొత్త సూచనలు వచ్చే వరకు ఇవే ధరలు కొనసాగుతాయి. దీనికి సంబంధించి సెంట్రల్ రైల్వే జోన్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. స్టేషన్, ప్లాట్‌ఫారమ్‌కి వచ్చే వ్యక్తుల సంఖ్యను తగ్గించడానికి ప్లాట్‌ఫాం టిక్కెట్ ధరలను పెంచుతున్నట్లు తెలిపింది.

ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ల ధరలను పెంచడానికి డివిజనల్ రైల్వే మేనేజర్‌లకు (DRM లు) పూర్తి అధికారం ఉంది. వారు తమ తమ రాష్ట్రాల్లోని స్టేషన్‌లలో రద్దీ, పరిస్థితుల దృష్ట్యా ధరలు పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. 2015లో ఈ హక్కు వారికి కల్పించారు. మరోవైపు రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారమ్‌లలో మాస్క్‌లు ధరించని వారికి రూ.500 జరిమానా విధిస్తామని రైల్వే బోర్డు తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి నివారణ కోసం జారీ చేసిన ఈ ఉత్తర్వును వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు పొడిగించారు. గతంలో మాస్కులు ధరించకుంటే జరిమానా విధించే అవకాశం సెప్టెంబర్ వరకు అమలులో ఉండేది ఇప్పుడు దానిని మరో ఆరు నెలలు పొడిగించారు.

Maa Elections 2021: ప్రకాశ్‌ రాజ్ ప్యానెల్ డబ్బులు పంచుతుందట..! ‘మా’ అధ్యక్షుడు నరేశ్‌ కామెంట్స్‌



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3DqMcWj

Related Posts

0 Response to "Railway: ఆ రైల్వే స్టేషన్ల ప్లాట్‌ఫాం టికెట్‌ చాలా ఖరీదు..! ఎందుకో తెలుసా..?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel