
MAA Elections 2021 Live: జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు చేరుకుంటున్న తారలు.. మోహన్ బాబు ఆశీర్వాదం తీసుకున్న ప్రకాశ్ రాజ్.

MAA Elections Voting Live Updates: సవాళ్లు, ప్రతి సవాళ్లు.. మాటల యుద్ధం, రాజకీయ నాయకులను మించిన ఆరోపణలు, వాగ్దానాలు.. ఇవీ గత కొన్ని రోజుల నుంచి తెలుగు సినీ పరిశ్రమలో కనిపిస్తోన్న పరిస్థితి. సాధారణ రాజకీయ ఎన్నికలను తలదన్నె రీతిలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల అగ్గి రాజుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ రెండు వర్గాలుగా చీలిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఈ ఎన్నికల ఫలితం అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ఇటు సామాన్య జనాల్లోనూ ఆసక్తి నెలకొంది.
అన్ని ఏర్పాట్లు సిద్ధం..
మా ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఇందుకోసం జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటలకు మొదలయ్యే ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటలవరకు ఎన్నికలు జరగనున్నాయి. 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాల్ని కూడా ఇదే రోజు ప్రకటించనున్నారు. నిజానికి తొలుత సోమవారం ప్రకటించాలనుకున్నా, ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆదివారం రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3AyMOYo
0 Response to "MAA Elections 2021 Live: జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు చేరుకుంటున్న తారలు.. మోహన్ బాబు ఆశీర్వాదం తీసుకున్న ప్రకాశ్ రాజ్."
Post a Comment