-->
Vijay Devarakonda: మళ్లీ షూరు కానున్న లైగర్.. బాక్సింగ్ రింగ్‏లోకి విజయ్ దేవరకొండ..

Vijay Devarakonda: మళ్లీ షూరు కానున్న లైగర్.. బాక్సింగ్ రింగ్‏లోకి విజయ్ దేవరకొండ..

Vijay Devarakonda

Liger Movie Update: యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా లైగర్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే శరవేగంగా జరుగుతున్న ఈ సినిమాకు షూటింగ్‏కు కరోనాతో బ్రేక్ పడింది. దీంతో షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఇక కోవిడ్ సెకండ్ అనంతరం కేసులు తగ్గుముఖం పట్టడంతో దాదాపు అన్ని చిత్రాలు షూటింగ్ పూర్తిచేసుకుని థియేటర్లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే కరోనా కారణంగా బ్రేక్ పడిన లైగర్ సినిమా షూటింగ్ మళ్లీ ఆరంభం కానుంది. గోవాలో నెల రోజుల షెడ్యూల్‏ను ప్లా్న్ చేశారట మేకర్స్. వచ్చే వారం చిత్రయూనిట్ గోవా ప్రయామం కానుందని టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఛార్మీ, పూరీ జగన్నాథ్, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఇందులో విజయ్ కిక్ బాక్సర్‍గా కనిపించనున్నాడు. ఇందుకోసం రౌడీ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నాడు. భారీ వర్కవుట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీతో కంప్లీట్ మేకోవర్ అయ్యాడు. ఇక ఈ మూవీలో రోనీత్ రాయ్, ఆలీ, తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ వర్క్ మొత్తాన్ని విజయ్ ఇంట్లో నుంచే పూర్తి చేశాడు. ఇటీవల విజయ్ ఇంట్లో వర్క్ ఫ్రమ్ చేస్తున్న ఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఇక విజయ్ ఈ సినిమా తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే మజిలీ ఫేం శివ నిర్వాణతో ఓ సినిమా చేయనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

Also Read:  Tollywood Heroine: ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.? ఆమె హెయిర్ చూశాక కూడా గుర్తు రావట్లేదా

OTT Platforms: థియేటర్స్ తెరుచుకుంటున్నా తగ్గని డిజిటల్ జోరు.. ఓటీటీకే ఓటేస్తున్న హీరోలు..



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3l9Tab1

0 Response to "Vijay Devarakonda: మళ్లీ షూరు కానున్న లైగర్.. బాక్సింగ్ రింగ్‏లోకి విజయ్ దేవరకొండ.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel