
Thaman: పుష్ప పాటలపై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్.. ఏం చెప్పారంటే..

ప్రస్తుతం సినీ పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హవా నడుస్తోందనే చెప్పుకోవాలి. అల వైకుంఠపురం సినిమా తర్వాత తమన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలోని ప్రతి పాట సూపర్ హిట్. తనదైన మ్యూజిక్‌తో శ్రోతలకు ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాడు తమన్. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌లలో ఒకరు దేవి శ్రీ ప్రసాద్. అయితే తమన్.. దేవి శ్రీ ప్రసాద్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుందంటూ గత కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు వీరిద్దరు అతిథులుగా వచ్చారు. ఈ గేమ్ షోలో వీరిద్దరు ఎంతో సన్నిహితంగా కనిపించారు. ఎన్టీఆర్ తో కలిసి ముచ్చట్లు పెట్టారు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరగడం లేదా అనే… స్నేహితులుగానే ఉన్నారా ? సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా తమన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన ట్విట్టర్ ఖాతాలో తమన్ అభిమానులతో కాసేపు ముచ్చటించారు. #ASKTHAMAN అంటూ నిన్న అభిమానులతో చిట్ చాట్ నిర్వహించాడు తమన్. కొద్ది సేపు మాత్రమే అందుబాటులో ఉంటాను.. ఎవరికైనా ఏదైనా అడగాలి ఉంటే.. తెలుసుకోవాలని ఉంటే.. ప్రశ్నించండి అని చెప్పాడు తమన్. దీంతో అభిమానులు తమన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. అభిమాన హీరోల గురించి.. ప్రస్తుతం తమన్ చేస్తున్న సినిమాల గురించి అప్డేట్స్ గురించి అడిగేశారు. అఖండ, గాడ్ ఫాదర్, సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ ఇలా అన్ని సినిమా అప్డేట్స్ అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్.. పుష్ప పాటల మీద మీ అభిప్రాయం ఏంటీ ? ఎంజాయ్ చేస్తున్నారా అని అడగ్గా.. ఈ క్రమంలో తమన్.. అల్లు అర్జున్ గురించి మాత్రమే ప్రస్తావించాడు.. నేను సాధారణంగానే అల్లు అర్జున్ గారిని ఇష్టపడతాను.. అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఎక్కడా దేవి శ్రీ ప్రసాద్ పేరు ఎత్తలేదు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నిజంగానే నడుస్తుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.
Yes very much
I basically love AA gaaru a lot
https://t.co/GXB5Nbs7HI
— thaman S (@MusicThaman) November 9, 2021
Also Read: Megastar Chiranjeevi: గ్రాండ్‌గా ప్రారంభమైన భోళా శంకర్.. చిరంజీవి సినిమా పూజా కార్యక్రమాలు లైవ్..
Keerthy Suresh: కీర్తిసురేష్‌లోని అద్భుతమైన టాలెంట్‌ను బయటపెట్టనున్న తమన్.. అదేంటంటే..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3F9BmoJ
0 Response to "Thaman: పుష్ప పాటలపై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్.. ఏం చెప్పారంటే.."
Post a Comment